News April 4, 2025

రాజమండ్రి: ఫార్మాసిస్టు నాగాంజలి మృతి

image

మృత్యువుతో 12 రోజుల పాటు పోరాడిన ఫార్మాసిస్టు నాగాంజలి (23) శుక్రవారం మృతి చెందింది. కిమ్స్ బొల్లినేని ఆసుపత్రి AGM దీపక్ లైంగిక వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన నాగాంజలి గత నెల 23వ తేదీ నుంచి కిమ్స్ బొల్లినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. నాగాంజలి మృతదేహాన్ని రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

Similar News

News April 9, 2025

రాజమండ్రి: ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మహిళ మోసం

image

ప్రభుత్వం ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి ఓ మహిళ నలుగురు వ్యక్తులకు టోకరా వేసిన ఘటన రాజమండ్రిలో చోటు చేసుకుంది. స్థానిక జీజీహెచ్‌లో తనకు అధికారులు తెలుసునని..ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలికి రూ.6.50లక్షలు వసూలు చేసింది. అనంతరం ఆమె ముఖం చాటేయడంతో మోసపోయామని తెలుసుకున్న నలుగురు బాధితులు మంగళవారం జీజీహెచ్ సూపరింటెండెంట్ డా.లక్ష్మి సూర్యప్రభకు వారు ఫిర్యాదు చేయగా ఘటనపై ఆమె ఎంక్వైరీ ప్రారంభించారు.

News April 9, 2025

తూ.గో: అకాల వర్షాలతో అవస్థలు

image

తూ.గో జిల్లాలో అకాల వర్షాలతో అవస్థలు తప్పడం లేదు. వర్షంతో పంట నష్టం జరుగుతోంది. పిడుగులు సైతం పడుతుండటంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. నల్లజర్ల మండలం కృష్ణమ్మగూడెనికి చెందిన వెలగాని సత్యనారాయణ(46) సైతం నిన్న పిడుగుపడి చనిపోయిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న ఆయన ఇటీవల గ్రామానికి వచ్చి చనిపోవడంతో బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. పిడుగులు పడే సమయంలో చెట్ల కిందకు వెళ్లకండి.

News April 9, 2025

పీజీఆర్ఎస్ అర్జీలు పరిష్కారం ఒక ఎండార్స్‌మెంట్ అవ్వొద్దు: కలెక్టర్

image

పీజీఆర్ఎస్ అర్జీలు పరిష్కారం ఒక ఎండార్స్‌మెంట్ అవ్వొద్దని, అందులో సంబంధించిన ఉత్తర్వులు కచ్చితంగా ఉండాలని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరం నుంచి ఆర్డీవో, తహశీల్దార్లు, మండల సర్వే అధికారులతో సమావేశం అయ్యారు. రెవెన్యూ అర్జీలు, వాటి పరిష్కార విధానం, ఐవీఆర్‌ఎస్ ఫిర్యాదులపై ప్రతిస్పందన వ్యవస్థపై చర్చించారు.

error: Content is protected !!