News April 4, 2025

రాజమండ్రి: ఫార్మాసిస్టు నాగాంజలి మృతి

image

మృత్యువుతో 12 రోజుల పాటు పోరాడిన ఫార్మాసిస్టు నాగాంజలి (23) శుక్రవారం మృతి చెందింది. కిమ్స్ బొల్లినేని ఆసుపత్రి AGM దీపక్ లైంగిక వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన నాగాంజలి గత నెల 23వ తేదీ నుంచి కిమ్స్ బొల్లినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. నాగాంజలి మృతదేహాన్ని రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

Similar News

News November 7, 2025

ఓపిక ఉండట్లేదా?

image

వాతావరణ మార్పులు, వేళకి తినకపోవడం, ఇంటా బయటా పనంటూ ఉరుకులు పరుగుల వల్ల చాలామంది మహిళలు తరచూ నీరసపడిపోతూ ఉంటారు. తగినంత విశ్రాంతి లేకపోతే శరీరం మాత్రం కోలుకోదు. కాబట్టి విశ్రాంతి తప్పనిసరి. రోజూ మీ ఆహారంలో పప్పుధాన్యాలు, గింజలను తప్పనిసరి చేసుకోండి. తేలికపాటి వ్యాయామాల్నీ దినచర్యలో తప్పక భాగం చేసుకోవాలి. పనంతా పూర్తయ్యాక తప్పదు కాబట్టి నిద్ర అన్నట్లుగా కాక ఒక సమయాన్ని నిర్దేశించుకోండి.

News November 7, 2025

శుక్రవారం ఈ పని చేయకూడదా..?

image

శుక్రవారం రోజున దేవతా విగ్రహాలు, పటాలు, పూజా సామాగ్రిని శుభ్రం చేయడం అస్సలు మంచిది కాదని పండితులు చెబుతారు. ‘శుక్రవారం లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఆ రోజున ఇలాంటి కార్యాలు చేపడితే ఆ దేవత ఆగ్రహించే అవకాశాలు ఉంటాయి. అలాగే ఇంటి నుంచి వెళ్లిపోవడానికి ఈ పనులు కారణమవుతాయి. అందుకే శుక్రవారం రోజున ఇలా చేయకూడదు. దేవుడి విగ్రహాలు, పటాల శుభ్రతకు బుధ, గురు, ఆది, సోమవారాలు అనుకూలం’ అని అంటారు.

News November 7, 2025

నేడు స్పీకర్ విచారణకు జగదీశ్ రెడ్డి, సంజయ్

image

TG: ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై మలిదశ విచారణ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇవాళ స్పీకర్ ప్రసాద్ సమక్షంలో పోచారం శ్రీనివాసరెడ్డి తరఫు న్యాయవాదులు జగదీశ్ రెడ్డిని, అరెకపూడి గాంధీ తరఫు లాయర్లు కల్వకుంట్ల సంజయ్‌ను ప్రశ్నించనున్నారు. నిన్న స్పీకర్ సమక్షంలో జగిత్యాల MLA సంజయ్‌పై ఫిర్యాదు చేసిన జగదీశ్ రెడ్డిని, వెంకట్రావ్‌పై ఫిర్యాదు చేసిన వివేకానందను ఆధారాలకు సంబంధించి లాయర్లు క్రాస్ ఎగ్జామిన్ చేశారు.