News August 30, 2025
రాజమండ్రి: ఫీజు రీయింబర్స్‌మెంట్ వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభం

గిరిజన విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభమైనట్లు తూర్పు గోదావరి జిల్లా గిరిజన సంక్షేమ సాధికారిత అధికారిణి ఎం. నాగ శిరీష శనివారం తెలిపారు. కాలేజీల్లో విద్యార్థుల అప్లికేషన్ రిజిస్ట్రేషన్, ప్రిన్సిపల్ ఆన్‌లైన్ అప్రూవల్ పూర్తయిన తర్వాతే విద్యార్థులు తమ గ్రామ, వార్డు సచివాలయాల్లో ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం ఐదు దశల వెరిఫికేషన్ చేయించుకోవాలని ఆమె సూచించారు.
Similar News
News August 31, 2025
గోపాలపురంలో నేటి చికెన్ ధరలు

గోపాలపురంలో ఆదివారం చికెన్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. కేజీ రూ.220-240 వరకు విక్రయిస్తున్నారు. స్కిన్ లెస్ రూ.260, ఫారం మాంసం రూ.220, నాటుకోడి మాంసం రూ.400లకు వ్యాపారులు అమ్ముతున్నారు. ఒక్కో దుకాణం వద్ద ధరల విషయంలో వత్యాసం ఉంటుంది. మీ ప్రాంతంలో చికెన్ ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.
News August 30, 2025
రాజమండ్రి వచ్చిన నారా రోహిత్

సుందరకాండ మూవీ విజయ యాత్రలో భాగంగా శనివారం రాజమండ్రిలోని సూర్య ప్యాలెస్ థియేటర్‌కు హీరో నారా రోహిత్ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయనను రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కలిశారు. అనంతరం సినిమా విజయోత్సవ మీట్‌లో నారా రోహిత్‌తో కలిసి పాల్గొన్నారు. సుందరకాండ సినిమా విజయం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.
News August 30, 2025
8న గుర్తింపు లేని రాజకీయ పార్టీలతో సమావేశం: కలెక్టర్

తూ. గో జిల్లాకు చెందిన గుర్తింపు లేని రాజకీయ పార్టీల సంప్రదింపు వివరాలపై విచారణను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సమక్షంలో సెప్టెంబర్ 8 న అమరావతిలో నిర్వహించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పి ప్రశాంతి శనివారం ప్రకటించారు. ఉ.10:50 గంటలకు భరత్ ప్రజా స్పందన పార్టీ, 11:00 గంటలకు భారతీయ చైతన్య పార్టీ, 11:30 గంటలకు జై ఆంధ్రా పార్టీ ప్రతినిధులు వివరాలతో వెలగపూడి సచివాలయం కార్యాలయానికి రావాలన్నారు.