News January 28, 2025
రాజమండ్రి: బాలల సంరక్షణ గృహానికి నిందితుడు

రాజమండ్రి వీరభద్రపురంలో ఈ నెల 24వ తేదిన జరిగిన కిలారి పోతురాజు హత్య ఘటనలో నిందితుడు మైనర్ కావడంతో అతడిని సోమవారం అదుపులోకి తీసుకున్నట్లు త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ అప్పారావు తెలిపారు. న్యాయమూర్తి ఆదేశాలు మేరకు బాలల సంరక్షణ గృహానికి తరలించామన్నారు. పోతురాజు హత్యపై దర్యాప్తు చేసి బాలుడిని నిందితుడుగా గుర్తించామన్నారు. ఈ హత్యకు ప్రధాన కారణం వివాహేతర సంబంధమని ఇన్స్పెక్టర్ తెలిపారు.
Similar News
News September 16, 2025
ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 9 అర్జీలు: ఎస్పీ

ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, అర్జీలు పునరావృతం కాకుండా చట్ట పరిధిలో శాశ్వత పరిష్కారం చూపాలని ఎస్పీ శ్రీ అద్నాన్ నయీం అస్మీ అన్నారు. పాలకోడేరు మండలం గరగపర్రులోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా వేదికకు 9 అర్జీలు వచ్చాయన్నారు. వాటిని నిర్ణీత గడువులోగా పరిష్కరించాలన్నారు.
News September 16, 2025
ప.గో: 13 మంది ఉద్యోగులకు పదోన్నతి

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్‌లో ఏఓలు, డిప్యూటీ ఎంపీడీవోలుగా పనిచేస్తున్న 13 మంది ఉద్యోగులకు పదోన్నతి కల్పిస్తూ జడ్పీ ఛైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. తమ శ్రమను గుర్తించి ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామని ఆమె తెలిపారు. ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నానని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
News September 16, 2025
సిరిసిల్ల: సత్వర న్యాయం చేయడానికే గ్రీవెన్స్ డే

సత్వర న్యాయం చేయడానికే గ్రీవెన్స్ డే కార్యక్రమం అని సిరిసిల్ల ఎస్పీ మహేష్ బి గితే అన్నారు. సిరిసిల్లలోని ఎస్పీ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుండి 36 ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి సంబంధిత పోలీస్ స్టేషన్ కు ఫోన్ చేసి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించినట్టు పేర్కొన్నారు.