News August 4, 2025
రాజమండ్రి భవన నిర్మాణ అనుమతులు పరిశీలించిన కలెక్టర్

రాజమండ్రి నగరంలో భవన నిర్మాణ అనుమతులు (బీఏ), ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ (ఓసీ) మంజూరు ప్రక్రియను జిల్లా కలెక్టర్, కమిషనర్ పి.ప్రశాంతి పర్యవేక్షించారు. పౌర సేవల్లో పారదర్శకత, సామర్థ్యం పెంచేందుకు ఆమె సోమవారం నగర ప్రణాళిక అధికారులతో కలిసి పలు వార్డుల్లో పర్యటించారు. దరఖాస్తు ఫైళ్లను పరిశీలించి, నిబంధనల ప్రకారం అనుమతులు జారీ అవుతున్నాయో లేదో నిర్ధారించుకున్నారు. అధికారులకు తగు సూచనలిచ్చారు.
Similar News
News January 29, 2026
రాష్ట్రంలో తూ.గో జిల్లాకు ద్వితీయ స్థానం

RTC నిర్వహించిన లాజిస్టిక్స్ డోర్ డెలివరీల్లో తూ.గో జిల్లా రాష్ట్రంలో ద్వితీయ స్థానం సాధించింది. అందుకు విశేషంగా కృషి చేసిన జిల్లా ప్రజా రవాణా అధికారి వై.ఎస్.ఎన్ మూర్తిని విజయవాడ కార్యాలయంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి, ఆర్టీసీ ఎండీ సీహెచ్ ద్వారకా తిరుమలరావులు అభినందించారు. ప్రశంసా పత్రం, రివార్డుతో డీపీటీఓ మూర్తిని సత్కరించారు. ఆర్టీసీ అధికారులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
News January 29, 2026
తూ.గో: బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకి ఎస్సీ కమిషన్ ఛైర్మన్ ఆదేశం

రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న బ్యాక్‌లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఎస్సీ కమిషన్ ఛైర్మన్ కేఎస్ జవహర్ అధికారులను ఆదేశించారు. బుధవారం రాజమండ్రి ఆర్ అండ్ బీ అతిథి గృహంలో ఆయన సమీక్ష నిర్వహించారు. వసతి గృహాల్లో సమస్యలను పరిష్కరించాలని, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని సూచించారు. అనంతరం బాధితుల నుంచి వినతి పత్రాలను స్వీకరించి, పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.