News September 4, 2025
రాజమండ్రి: ‘యూరియా నిల్వలు 2142 మెట్రిక్ టన్నులు’

తూర్పుగోదావరి జిల్లాలో ప్రస్తుతం 2142 మెట్రిక్ టన్నులు యూరియా నిల్వలు ఉన్నాయని కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. అవసరాల దృష్ట్యా అదనంగా సెప్టెంబర్ 5, 6 తేదీలలో యూరియాను అందుబాటులోకి తెస్తామన్నారు. యూరియా కోసం కంట్రోల్ రూమ్ నెంబర్ 89779 35611లో సంప్రదించాలని సూచించారు.
Similar News
News September 5, 2025
రాజనగరం: నిత్య విద్యార్థిగా 8 డిగ్రీలు పొందిన ఉత్తమ ఉపాధ్యాయుడు

మండలంలోని వెలుగు బంధ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న పవన్ కుమార్ జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. 2011 వరకు కానిస్టేబుల్ గా పనిచేసిన ఆయన ఉపాధ్యాయ వృత్తి పట్ల ఉన్న అభిమానంతో 2012లో నిర్వహించిన డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ వృత్తిలోకి అడుగు పెట్టారు. విద్యార్థులతో మమేకమవ్వడమే కాకుండా తాను నిత్య విద్యార్థిగా ఇప్పటివరకు ఎనిమిది డిగ్రీ పట్టాలను అందుకున్నారు.
News September 4, 2025
మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలి: ఎస్పీ

రాజమండ్రి: ప్రేమ, సహనం, శాంతి, సామరస్యాలను బోధించిన మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని ఎస్పీ డి. నరసింహ కిషోర్ కోరారు. ముస్లింలందరికీ “మిలాద్- ఉన్- నబీ” శుభాకాంక్షలు తెలియజేస్తూ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. మహమ్మద్ ప్రవక్త జీవితం మానవ జాతికి ఆదర్శమన్నారు. సామరస్యం, సోదరభావం , ఇతరుల పట్ల ప్రేమ ప్రవక్త చూపిన మార్గాలన్నారు.
News September 4, 2025
తూ.గో: జాయింట్ కలెక్టర్‌గా మేఘా స్వరూప్

తూ.గో జిల్లా జాయింట్ కలెక్టర్‌గా మేఘా స్వరూప్ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ కె.విజయానంద్ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. మేఘా స్వరూప్ 2021 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన వారు. ప్రస్తుత జాయింట్ కలెక్టర్ చిన్నరాముడు బదిలీ అయ్యారు. ఆయనను జనరల్ అడ్మినిస్ట్రేషన్‌లో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి.