News April 10, 2025

రాజమండ్రి: రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి మృతి

image

ధవళేశ్వరం హార్లిక్స్‌ ఫ్యాక్టరీ వద్ద బుధవారం లారీ ఢీకొట్టిన ఘటనలో గాయపడ్డ రాజానగరం మండలం జి.యర్రంపాలెం గ్రామానికి చెందిన మోటర్‌ సైకిలిస్టు శ్రీను (50) రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. తణుకు మండలం వేల్పూరులోని మేనకోడలి ఇంటి వద్ద నుంచి జి.యర్రంపాలెం గ్రామం వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతుడి భార్య సుజాత ఫిర్యాదు మేరకు ధవళేశ్వరం ఏఎస్సై శివాజీ కేసు నమోదు చేశారు.

Similar News

News February 21, 2026

నల్లజర్ల: కానిస్టేబుల్‌ను ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు

image

నల్లజర్ల మండలం పుల్లలపాడు జాతీయ రహదారిపై శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. విధులు నిర్వహిస్తున్న బీట్ కానిస్టేబుల్ రవిని ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వేగంగా ఢీకొట్టిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఘటనలో రవికి తీవ్ర గాయాలు కాగా, పోలీసులు ఆయనను తాడేపల్లిగూడెం ఆసుపత్రికి తరలించారు. కానిస్టేబుల్‌ను ఢీకొట్టిన బస్సు ఆపకుండా వెళ్లిపోయిందని స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

News February 21, 2026

సంక్షేమ పథకాలే లక్ష్యంగా ‘యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే’: కలెక్టర్

image

ఏపీ ప్రభుత్వం స్వర్ణగ్రామ/స్వర్ణవార్డ్ ఆధ్వర్యంలో యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే నిర్వహిస్తోందని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ప్రభుత్వ విధానాల రూపకల్పన, సంక్షేమ పథకాల పారదర్శక అమలు, లబ్ధిదారులకు వేగంగా సేవలు అందించేందుకు సమగ్ర డేటా సేకరించడమే ఈ సర్వే ఉద్దేశమని పేర్కొన్నారు. సిబ్బంది ఇంటికి వచ్చినప్పుడు ప్రజలు తప్పనిసరిగా సహకరించి వివరాలు అందించాలని శుక్రవారం ఒక ప్రకటనలో ఆమె కోరారు.