News August 29, 2025
రాజమండ్రి: విద్యార్థిని ఇస్త్రీ పెట్టెతో కాల్చిన ఘటనలో నలుగురు అరెస్ట్

మోరంపూడిలోని శ్రీచైతన్య స్కూల్లో విద్యార్థిని ఇస్త్రీ పెట్టెతో కాల్చిన ఘటనలో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. CI కాశీ విశ్వనాథ్ వివరాలు.. పాఠశాలలోని CC కెమెరాలను సహచర విద్యార్థులు తొలగించి దాచుకున్నారని విద్యార్థి ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేశాడు. దీంతో అతనిపై ఈ దాడికి పాల్పడ్డారు. ఇద్దరు విద్యార్థుల్ని జువైనల్ కోర్టులో హాజరుపర్చారు. ప్రిన్సిపాల్, హాస్టల్ ఫ్లోర్ ఇన్‌ఛార్జ్‌ను అరెస్ట్ చేశారు.
Similar News
News August 29, 2025
రేపు ఖైరతాబాద్ గణపతి దర్శనానికి అమెరికన్ కాన్సులేట్

HYD ఖైరతాబాద్ గణనాథుని దర్శనం కోసం ఆగస్టు 30న HYD అమెరికన్ కాన్సులేట్ విలియమ్స్ రానున్నారు. ఈ నేపథ్యంలో ఖైరతాబాద్ గణపతి వద్ద భద్రతను అధికారులు తనిఖీ చేశారు. ఘనంగా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన ఖైరతాబాద్ గణపతి దర్శనం కోసం తాను ఎంతగానో వేచి చూస్తున్నట్లుగా విలియమ్స్ తెలిపారు.
News August 29, 2025
విశాఖ చేరుకున్న సీఎం చంద్రబాబు

సీఎం చంద్రబాబు విశాఖ చేరుకున్నారు. శుక్రవారం కోస్టల్ బ్యాటరీ వద్దకు హెలిపాడ్‌లో చేరుకున్నారు. ఆయనకు జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, హోంమంత్రి వంగలపూడి అనిత, కలెక్టర్ హరేంధిర ప్రసాద్, సీపీ శంఖబ్రత బాగ్చీ పుష్ప గుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. అనంతరం సీఎం నోవాటెల్‌కు బయలుదేరి వెళ్లారు.
News August 29, 2025
HYD: బుల్లెట్లను క్యారీ చేస్తున్న నిందితుడు ఇతడే

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో బుల్లెట్ల కలకలం రేపిన విషయం తెలిసిందే. అమృత్‌సర్ ప్రయాణికుడి లగేజీలో సీఐఎస్ఎఫ్ సెక్యూరిటీ అధికారులు 8 లైవ్ బుల్లెట్లు గుర్తించారు. 32 ఏళ్ల పంజాబ్ వాసి సుఖ్దీప్‌సింగ్ ఇండిగో విమానంలో ఢిల్లీ మీదుగా అమృత్‌సర్ వెళ్లేందుకు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నాడు. లగేజీలో చెకింగ్‌లో పట్టుబడగా అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.