News March 27, 2025
రాజమండ్రి : వైద్య విద్యార్థిని ఆత్మహత్యాయత్నం.. నిందితుడి అరెస్ట్

వైద్య విద్యార్థిని అంజలి ఆత్మహత్యాయత్నం కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న దీపక్ ను గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు. బొల్లినేని కిమ్స్ ఆసుపత్రి సూపరింటెండెంట్ దీపక్, అంజలిపై లైంగికంగా వేధింపులకు గురిచేసినట్లు కుటుంబీకులు ఆరోపించి ఆందోళన చేసిన విషయం తెలిసిందే. గురువారం అతన్ని అరెస్ట్ చేసినట్లు డిఎస్పీ భవ్య కిశోర్ వెల్లడించారు.
Similar News
News March 31, 2025
రాజమండ్రి: ముస్లిం సోదరులకు కలెక్టర్ శుభాకాంక్షలు

రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు వారి కుటుంబ సభ్యులకు జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆమె ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ..తోటి వారికి, పేద వారికి మనకు ఉన్న దాంట్లో సహాయం చేసే గొప్ప దాన గుణాన్ని చాటే పండుగ రంజాన్ అన్నారు. దాతృత్వానికి ప్రతీకగా నిలిచే రంజాన్ మాస ఉపవాస దీక్షలు నియంత్రణా సాధ్యం చేసే గొప్ప సందేశం అని పేర్కొన్నారు.
News March 30, 2025
రాజమండ్రి: సోమవారం పీజీఆర్ఎస్ రద్దు: కలెక్టర్

మార్చి 31 రంజాన్ సందర్భంగా ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించడంతో పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని సోమవారం తాత్కాలికంగా రద్దు చేసినట్టు జిల్లా కలెక్టర్ ప్రశాంతి ఆదివారం ప్రకటించారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయం, రెవెన్యు డివిజనల్, మునిసిపల్, మండల స్థాయిలో కార్యక్రమం నిర్వహించడం లేదన్నారు. జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కలెక్టర్ ప్రశాంతి విజ్ఞప్తి చేశారు .
News March 30, 2025
రాజనగరం: ‘ఉగాది’లో విద్యార్థులు

తెలుగువారి నూతన సంవత్సరం ప్రారంభమయ్యే ‘ఉగాది’ పండుగను పురస్కరించుకుని స్థానిక దివ్య కళాశాల విద్యార్థులు శనివారం సాయంత్రం కళాశాల మైదానంలో ‘ఉగాది’ అక్షరాలుగా ఏర్పడి ఆ పండుగ పట్ల తమకు ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. వీరి ఆకృతిని చూసేందుకు వచ్చిన అధ్యాపకులు, సహ విద్యార్థులకు వారు ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ సందడి చేశారు. దీంతో విద్యార్థులను ఉపాధ్యాయులు అభినందించారు.