News August 5, 2025
రాజమండ్రి: వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని కలిసిన పెద్దిరెడ్డి

రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డిని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంగళవారం కలిశారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితి, అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. సీఎం చంద్రబాబు ఎంపీని అక్రమంగా అరెస్టు చేయించారని పెద్దిరెడ్డి మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, మాజీ ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, వంగా గీత తదితరులు పాల్గొన్నారు.
Similar News
News February 19, 2026
గొల్లగూడెం: ట్రాక్టరుపై నుంచి పడి బాలిక స్పాట్ డెడ్

దేవరపల్లి మండలంలోని గొల్లగూడెం వద్ద గురువారం జరిగిన ప్రమాదంలో 11 ఏళ్ల బాలిక మృతి చెందింది. నిడదవోలు మండలం సమీశ్రగూడెంకు చెందిన ఓ కుటుంబం పొగాకు పనుల నిమిత్తం దుమంతులగూడెం వలస వచ్చింది. పనికి వెళ్తుండగా ట్రాక్టరుపై నుంచి బాలిక ప్రమాదవశాత్తు జారి కిందపడటంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. దేవరపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News February 19, 2026
కొవ్వూరు మున్సిపాలిటీపై పసుపు జెండా

తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మున్సిపల్ పీఠం TDP పరమైంది. YCP మున్సిపల్ ఛైర్‌పర్సన్ బావన రత్నకుమారితో పాటు నలుగురు కౌన్సిలర్లు పల్లా శ్రీనివాసరావు సమక్షంలో బుధవారం TDPలో చేరారు. దీంతో ఎమ్మెల్యేతో కలిపి కూటమి బలం 14కు చేరి స్పష్టమైన మెజారిటీ లభించింది. గత ఎన్నికల్లో YCP గెలిచినప్పటికీ, తాజా మార్పులతో కొవ్వూరు మున్సిపాలిటీని TDP కైవసం చేసుకుంది.
News February 19, 2026
తూ.గో: భూ రికార్డుల సవరణ ఇక ఈజీ!

రెవెన్యూ రికార్డులైన వెబ్‌ల్యాండ్, ఆడంగల్‌లో మార్పులు చేసే అధికారాలను RDOలకు బదలాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని RDO కృష్ణనాయక్ తెలిపారు. మ్యూటేషన్ ప్రక్రియ కూడా ఇకపై డివిజన్ స్థాయిలోనే పూర్తవుతుందన్నారు. దీనివల్ల పౌరసేవలు వేగవంతమై ప్రజలకు ఇబ్బందులు తప్పుతాయని వివరించారు. భూసమస్యల పరిష్కారం కోసం జిల్లా కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానికంగానే పనులు జరుగుతాయని స్పష్టం చేశారు.


