News February 6, 2025

రాజమండ్రి: వ్యభిచార గృహంపై పోలీసుల దాడి

image

రాజమండ్రిలోని బొమ్మూరులో ఓ ఇంట్లో వ్యవభిచారం నిర్వహిస్తున్నారని సమాచారం అందడంతో బుధవారం సాయంత్రం పోలీసులు దాడులు నిర్వహించారు. వడ్డివీరభద్రనగర్‌లో వ్యభిచార గృహం నిర్వహిస్తున్న ఇంటిపై ఇన్‌స్పెక్టర్‌ కాశీవిశ్వనాథ్‌ సిబ్బందితో కలిసి దాడిచేశారు. వ్యభిచారం నిర్వహిస్తున్న వెంకటలక్ష్మి, ఆమె భర్త సత్యనారాయణతో పాటు ఇద్దరు విటులను అరెస్టు చేశామన్నారు. ఒక బాధిత మహిళను విడిపించామన్నారు.
దీనిపై కేసు నమోదైంది.

Similar News

News November 12, 2025

బిక్కనూర్: కుల బహిష్కరణ.. ఐదుగురిపై కేసు

image

కుల బహిష్కరణకు పాల్పడిన ఐదుగురిపై కేసు నమోదు చేసి వారిని రిమాడ్‌కు తరలించినట్లు బిక్కనూర్ ఎస్సై ఆంజనేయులు తెలిపారు. SI తెలిపిన వివారాలు.. జంగంపల్లికి చెందిన దొడ్లే గౌరవ్వ మంత్రాలు చేస్తోందనే నెపంతో కుల సభ్యులు ఆమెకు రూ.2.75 లక్షలు జరిమానా విధించారు. ఆమె నుంచి బలవంతంగా రూ.15 వేలు తీసుకున్నారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే కుల బహిష్కరణ చేస్తామని హెచ్చరించారు. దీంతో ఆమె బుధవారం పోలీసులను ఆశ్రయించింది.

News November 12, 2025

15-20 రోజుల్లో కాళేశ్వరం బ్యారేజీల్లో టెస్టులు: ఉత్తమ్

image

TG: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. మేడిగడ్డ కూలిపోవడానికి, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల్లో లీకేజీలకు తప్పుడు నిర్ణయాలు, సాంకేతిక లోపాలే ప్రధాన కారణమని NDSA పేర్కొందని చెప్పారు. 15-20 రోజుల్లో నీటి నిల్వలు తగ్గిన వెంటనే జియో ఫిజికల్, హైడ్రాలిక్ టెస్టులు నిర్వహిస్తామని వెల్లడించారు.

News November 12, 2025

నల్గొండలో సదరం కేంద్రం ప్రారంభించిన మంత్రి

image

దివ్యాంగుల కోసం నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ప్రత్యేక వైకల్య గుర్తింపు కార్డు జారీ కేంద్రాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ కేంద్రం ద్వారా దివ్యాంగులకు వైకల్య గుర్తింపు కార్డులు సులభంగా, వేగంగా లభించే సదుపాయం కలుగుతుందని తెలిపారు. దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో ముఖ్యమైన ముందడుగు అని మంత్రి పేర్కొన్నారు.