News September 3, 2024
రాజమండ్రి: సముద్రంలోకి 3.40 లక్షల క్యూసెక్కుల జలాలు

రాజమండ్రి రూరల్ మండలంలోని ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ నుంచి సోమవారం 3.40 లక్షల క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేశామని జలవనరులశాఖ అధికారులు తెలిపారు. తూర్పు డెల్టా, మధ్య డెల్టా, పశ్చిమ డెల్టా కాలవకు 3,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 8.60 అడుగులు నీటిమట్టం కొనసాగుతుందని చెప్పారు.
Similar News
News January 27, 2026
ఏపీపీఎస్సీ పరీక్షలకు కట్టుదిట్టమైన నిఘా: SP

రాష్ట్రవ్యాప్త APPSC పరీక్షల నేపథ్యంలో జిల్లాలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినట్లు SP డి.నరసింహా కిషోర్ మంగళవారం తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద అక్రమాలకు తావులేకుండా డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో నిరంతరం పర్యవేక్షణ ఉంటుందని, అభ్యర్థులు ప్రశాంతంగా పరీక్షలు రాసేలా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
News January 27, 2026
చాగల్లు విద్యార్థినుల TALENT

చాగల్లు మండలం ఊనగట్ల జెడ్పీ హైస్కూల్ విద్యార్థినులు పంతకాని లాస్య, కంచర్ల హనీ జాతీయ స్థాయి బీచ్ వాలీబాల్ పోటీలకు ఎంపికయ్యారు. అండర్-14 విభాగంలో వీరు ప్రతిభ చాటినట్లు హెచ్ఎం రమణ మంగళవారం తెలిపారు. పశ్చిమ బెంగాల్‌లోని దిగాలో ఈనెల 28 నుంచి 30 వరకు జరిగే పోటీల్లో వీరు పాల్గొననున్నారు. జాతీయ స్థాయిలో రాణించేందుకు వెళ్తున్న విద్యార్థినులను గ్రామస్థులు, ఉపాధ్యాయులు అభినందించారు.
News January 27, 2026
తూ.గో: APPSC పరీక్షలపై డ్రోన్ నిఘా

తూ.గో. జిల్లావ్యాప్తంగా APPSC పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట నిఘా ఏర్పాటు చేసినట్లు ఎస్పీ డి.నరసింహ కిషోర్ తెలిపారు. అక్రమాలను అరికట్టేందుకు డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక పర్యవేక్షణ చేపడుతున్నామని, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక పోలీస్ బృందాలు విధుల్లో ఉన్నాయని పేర్కొన్నారు. పరీక్షలు పారదర్శకంగా నిర్వహించేందుకు అభ్యర్థులు, సిబ్బంది సహకరించాలని ఆయన కోరారు.


