News April 13, 2025
రాజమండ్రి: స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను అభినందించిన డీఐజీ

ప్రవీణ్ కుమార్ పగడాల కేసు ఛేదించేందుకు అవసరమైన సాక్ష్యాలు సేకరించడంలో ఎంతో ప్రతిభ చాటిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని DIG అశోక్ కుమార్ అభినందించారు. శనివారం ఎస్పీ కార్యాలయంలో విలేకర్ల సమావేశం అనంతరం SIT టీంను డీఐజీ, ఎస్పీ నరసింహ కిషోర్ ప్రత్యేకంగా సన్మానించారు. సుమారు 400కుపైగా సీసీ కెమెరాలను పరిశీలించి కేసును కొలిక్కి తేవడంలో SIT అద్భుత ప్రతిభ చాటిందని ఎస్పీ నరసింహ కిషోర్ తెలిపారు.
Similar News
News April 14, 2025
GWL: బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేడ్కర్: SP

బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అని గద్వాల ఎస్పీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఆయన జయంతిని పురస్కరించుకొని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆదివారం అంబేడ్కర్ చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎస్పీ మాట్లాడుతూ.. చిన్నతనం నుంచి కుల వ్యవస్థను ఎదుర్కొంటూ ఉన్నత విద్యను అభ్యసించి, న్యాయవాదిగా, ఆర్థికవేత్తగా, సంఘ సంస్కర్తగా ఎదిగాడని ప్రశంసించారు.
News April 14, 2025
ఏపీలో రూ.5,001 కోట్లతో LG కొత్త ప్లాంట్!

AP: తిరుపతి జిల్లాలోని శ్రీసిటీలో LG కంపెనీ కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఏర్పాటు చేయబోతోంది. మే 8న దీని ఓపెనింగ్ సెర్మనీ ఉండే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం గతేడాది NOVలో 247 ఎకరాలను కేటాయించింది. రూ.5,001 కోట్ల పెట్టుబడులను ఆమోదించింది. ఈ ప్లాంటులో ఫ్రిజ్‌లు, ఏసీలు, వాషింగ్ మెషీన్లు, టీవీలు, కంప్రెషర్లను తయారు చేయనున్నారు. 1,495 మంది స్థానికులకు ప్రత్యక్ష ఉపాధి కల్గనుంది.
News April 14, 2025
అంబేద్కర్‌కి ఎస్పీ ఘన నివాళి

అంటరానితనం నిర్మూలనకు అక్షరమనే ఆయుధాన్ని ఎక్కుపెట్టిన దార్శనికుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ అని జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు అన్నారు. రాయచోటి ఎస్పీ ఆఫీసులో అంబేడ్కర్ జయంతి సందర్భంగా సోమవారం అంబేడ్కర్ చిత్ర పటానికి పూలమాలవేసి నివాళులు లర్పించారు. ఎస్పీ మాట్లాడుతూ.. అంబేడ్కర్ ఆలోచనలు రాబోయే తరాలకు కూడా మార్గదర్శకం అన్నారు. న్యాయవాదిగా, ఆర్థికవేత్తగా, రాజకీయవేత్తగా ఎదిగిన మహనీయుడు అన్నారు.