News August 21, 2025

రాజమండ్రి: 106 కుటుంబాలకు పునరావాస కేంద్రంలో ఆశ్రయం

image

గోదావరి వరదల కారణంగా రాజమండ్రిలోని ఏసీ గార్డెన్స్ ఎంపీఎల్ కళ్యాణ మండపంలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి గురువారం తెలిపారు. మొత్తం 106 కుటుంబాలకు ఆశ్రయం కల్పించామని వారిలో పురుషులు 110, మహిళలు 111, పిల్లలు 72 మంది ఉన్నట్లు వెల్లడించారు. ఆర్డీవో, తహశీల్దార్ ఆధ్వర్యంలో పర్యవేక్షణ జరుగుతుందన్నారు.

Similar News

News February 22, 2026

రాజమండ్రి: అనూరియా కేసులపై జిల్లా యంత్రాంగం అప్రమత్తం

image

తూ.గో. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశాల మేరకు రాజమండ్రిలో అనూరియా కేసుల క్లస్టర్‌పై జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా. కే.వెంకటేశ్వరరావు వివరాలు ప్రకారం రాజమండ్రికి చెందిన నలుగురు వ్యక్తులు అనూరియా లక్షణాలతో ఆసుపత్రిలో చేరినట్లు చెప్పారు. జిల్లా సర్వైలెన్స్ అధికారికి సమాచారం అందించి విచారణ ప్రారంభించామన్నారు.

News February 22, 2026

పరీక్షల వేళ డీజేలకు నో ఎంట్రీ.. ఎస్పీ హెచ్చరిక

image

పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల నేపథ్యంలో విద్యార్థులకు ఆటంకం కలగకుండా ధ్వని కాలుష్యంపై కఠినంగా వ్యవహరిస్తామని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ హెచ్చరించారు. పోలీసు అనుమతి లేకుండా డీజేలు, ఆర్కెస్ట్రాలు, డాన్స్ బేబీ డాన్సులు, స్టేజ్ ప్రోగ్రాములు నిర్వహించరాదని ఆదివారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన వార్నింగ్ ఇచ్చారు.

News February 22, 2026

రాజమండ్రి: ఎస్పీ వార్నింగ్.. రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్

image

జిల్లాలో రౌడీ షీటర్లు, గంజాయి, బ్లేడ్ బ్యాచ్‌లు తమ అరాచకాలను మానుకోవాలని, లేనిపక్షంలో వారిపై పిడి యాక్ట్ నమోదు చేస్తామని జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ హెచ్చరించారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఎస్‌హెచ్ఓల ఆధ్వర్యంలో అసాంఘిక శక్తులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు.