News March 15, 2025

రాజమండ్రి: 23 నుంచి సీపీఐ రాజకీయ ప్రచార జాత

image

రాజ్యాంగ పరిరక్షణ, సోషలిజం, సెక్యులరిజం, సామాజిక న్యాయమే లక్ష్యంగా మార్చి 23వ తేదీ నుంచి ఏప్రిల్ 14వ తేదీ వరకు సీపీఐ రాజకీయ ప్రచార జాత నిర్వహిస్తున్నట్లు జిల్లా కార్యదర్శి తాటిపాక మధు తెలిపారు. రాజమండ్రిలో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సీపీఐ వందేళ్ల చరిత్రను నాటకాల ద్వారా ప్రజలకు వివరిస్తామని చెప్పారు. ఈ క్రమంలో విస్తృతంగా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు.

Similar News

News March 15, 2025

రాజమండ్రి: రైల్వే చీఫ్ క్రూ కంట్రోలర్‌గా శ్రీనివాసరావు

image

దక్షిణ మధ్య రైల్వే రాజమండ్రిలో చీఫ్ క్రూ కంట్రోలర్‌గా శ్రీనివాసరావు నియమితులయ్యారు. ఇదే పదవిలో ఉన్న బీవీ బీకే రెడ్డి స్వచ్ఛందంగా రిటైరయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన నుంచి శ్రీనివాసరావు బాధ్యతలు స్వీకరించారు. ఉన్నతాధికారులు, క్రిందిస్థాయి ఉద్యోగులను సమన్వయం చేసుకుంటూ తన విధులను సమర్థవంతంగా నిర్వహిస్తానని శ్రీనివాసరావు తెలిపారు.

News March 15, 2025

తూ.గో జిల్లా ప్రజలకు గమనిక

image

వాహనాల ఫిట్‌నెస్ సర్టిఫికెట్లపై తూ.గో జిల్లా రవాణా శాఖ అధికారి ఆర్.సురేశ్ కీలక ప్రకటన చేశారు. ఇప్పటి వరకు రాష్ట్ర, జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో వాహనాలను పరిశీలించి ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు ఇచ్చామన్నారు. ఇకపై ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా సర్టిఫికెట్లు మంజూరు చేస్తామన్నారు. జిల్లాలోని ప్రజలు రాజానగరంలోని కంట్రోల్ అల్ట్ ఫిక్స్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను సంప్రదించి సర్టిఫికెట్లు తీసుకోవాలన్నారు.

News March 15, 2025

తూగో జిల్లా ఇన్‌ఛార్జ్ డీఎస్‌వోగా భాస్కర్ రెడ్డి

image

తూర్పు గోదావరి జిల్లా ఇన్‌ఛార్జ్ పౌర సరఫరాల శాఖ అధికారి(డీఎస్‌వో)గా కేఆర్ఆర్‌సీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎస్.భాస్కర్ రెడ్డి నియమితులయ్యారు. ఈ సందర్భంగా రాజమండ్రిలోని కలెక్టరేట్ ఆవరణలో ఉన్న పౌర సరఫరాల శాఖ అధికారి కార్యాలయంలో శనివారం బాధ్యతలు స్వీకరించారు. కే ఆర్.ఆర్.సి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌తో పాటు జిల్లా హౌసింగ్ పీడీగా భాస్కర్ రెడ్డి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

error: Content is protected !!