News March 24, 2025

రాజమండ్రి: 27న ఉపసర్పంచ్ పదవులకు ఎన్నికలు

image

జిల్లాలో వివిధ కారణాలు వల్ల ఖాళీగా ఉన్న 12 ఉపసర్పంచ్ పదవులకు ఈనెల 27న ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు డీపీవో శాంతామణి అన్నారు. రాజమండ్రి డివిజన్‌లో మల్లవరం, పాతతుంగపాడు, లక్ష్మినరసాపురం, మర్రిపూడి, మురమండ, మునికుడలి, కొవ్వూరు డివిజన్‌లో పెనకనమెట్ట, కొవ్వూరుపాడు, గోపాలపురం, వెంకటాయపాలెం, తాడిపూడి, ఉంద్రాజవరం పంచాయతీల ఉపసర్పంచ్ పదవులకు ఎన్నికలు జరుగనున్నాయి. EOPR&RD ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తున్నారు.

Similar News

News March 26, 2025

అనపర్తి: మహిళ స్నానం చేస్తుండగా వీడియో తీసి బెదిరింపులు

image

మహిళ స్నానం చేస్తుండగా వీడియో తీసి తమ కోరిక తీర్చాలని బెదిరించిన ఇద్దరూ వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఎస్సై శ్రీను నాయక్ మంగళవారం తెలిపారు. అనపర్తి మండలం పీరా రామచంద్రపురానికి చెందిన మణికంఠ రెడ్డి, రామకృష్ణారెడ్డి ఓ వివాహిత స్నానం చేస్తుండగా వీడియో తీసి, తమ కోరిక తీర్చాలని, రూ.1లక్ష ఇవ్వాలని ఆమెను బెదిరించారు. దీంతో ఆ మహిళ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

News March 26, 2025

ఉపసర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి: జేసీ

image

జిల్లాలో 12 గ్రామాలలో ఈ నెల 27న ఉప సర్పంచ్‌ల, బిక్కవోలు మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు, పెరవలి, రంగంపేటల రెండు కో-ఆప్షన్ సభ్యుల పరోక్ష ఎన్నికల ప్రక్రియను సజావుగా నిష్పక్షపాతంగా నిర్వహించాలని, ఆ మేరకు అధికారులు బాధ్యతతో వ్యవహరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ చిన్నరాముడు స్పష్టం చేశారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్లో సమన్వయ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు.

News March 25, 2025

కొంతమూరు: ప్రముఖ పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి

image

కొంతమూరు హైవే సమీపంలో మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదంలో ప్రముఖ పాస్టర్ ప్రవీణ్ పగడాల (45) అక్కడికక్కడే మృతి చెందారు. హైదరాబాద్ నివాసి అయిన పాస్టర్ రాజమండ్రి ఎయిర్‌పోర్ట్‌లో దిగి వ్యక్తిగత పనులు నిమిత్తమై బైక్‌పై వెళుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ఆయన చనిపోయారు. దీంతో నగరంలో ఉన్న పాస్టర్లు అందరూ వెంటనే ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి చేరుకున్నారు.

error: Content is protected !!