News February 18, 2025
రాజమండ్రి: ESI ఆసుపత్రిలో సిబ్బంది సస్పెన్షన్

రాజమహేంద్రవరంలోని ఈఎస్‌ఐ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న ఐదుగురు డాక్టర్లను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ మేరకు మంగళవారం సస్పెన్షన్ ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసింది. కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ సోమవారం ఆసుపత్రిలో ఆకస్మీకంగా తనిఖీలు చేపట్టారు. విధుల నిర్వహణలో బాధ్యతరహిత్యంగా వ్యవహరించడంపై మంత్రి సీరియస్ అయ్యారు. విచారణ అనంతరం ఐదుగురి డాక్టర్లను, నలుగురి సిబ్బందిని సస్పెండ్ చేశారు.
Similar News
News February 20, 2025
రాజమండ్రి: క్యూ ఆర్ కోడ్‌తో మెరుగైన పౌర సేవలు

ప్రజలకు అందుబాటులో ఉన్న పౌర సేవల విషయంలో క్యూ ఆర్ కోడ్ ద్వారా అందుతున్న సమాచారాన్ని విశ్లేషిస్తున్నామని కలెక్టర్ పి.ప్రశాంతి పేర్కొన్నారు. గురువారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఏపీపీఎస్సీ, గ్రూప్-2 పరీక్షలు, ఇంటర్ పరీక్షలు తదితర అంశాలపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. తూ.గో జిల్లాలో ఇంటర్ పరీక్షలు కోసం 51 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.
News February 20, 2025
తూ.గో: కోడిపందేలపై పోలీసుల దాడులు

నల్లజర్ల మండలం ముసళ్లకుంట గ్రామంలో కోడిపందేల స్థావరంపై నల్లజర్ల పోలీసులు గురువారం ఉదయం దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 28 మందిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 28 సెల్ ఫోన్లు, 7 కార్లు, ఒక మోటార్ సైకిల్ , 2 కోడి పుంజులు , రూ.6.2లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు నల్లజర్ల పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
News February 20, 2025
రాజానగరం : రెండు లారీల మధ్య నలిగిపోయి వ్యక్తి మృతి

రాజానగరం పోలీస్ స్టేషన్ పరిధిలోని కొంతమూరు గామన్ బ్రిడ్జిపై బుధవారం రాత్రి జరిగిన ప్రమాదంలో డ్రైవర్ మృతి చెందాడు. విశాఖపట్నం నుంచి మహారాష్ట్రకు ఇనుప ఊచలు లోడుతో వెళ్తున్న లారీని డ్రైవర్ శ్రీనివాసరావు(45) రోడ్డు పక్కకు ఆపి, టైర్లలో గాలి చెక్ చేస్తుండగా మరో లారీ ఢీకొంది. ప్రమాదంలో రెండు లారీల మధ్య నలిగి, అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడని ఎస్ఐ మనోహర్ తెలిపారు.