News October 21, 2024
రాజమహేంద్రవరం: పోలీసు అమరవీరులకు నివాళి

రాజమహేంద్రవరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ వద్ద పోలీస్ అమరవీరుల దినోత్సవ వేడుకలను పోలీసు అధికారులు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి పాల్గొని పోలీస్ అమరవీరుల స్తూపం వద్ద అమరవీరులకు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ నరసింహ కిషోర్, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.
Similar News
News February 28, 2026
కల్తీ పాలు బాధితులకు మంత్రి నిమ్మల భరోసా

రాజమండ్రి కలెక్టరేట్‌లో శనివారం జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి నిమ్మల రామానాయుడు వైద్య అధికారులతో సమీక్ష నిర్వహించారు. కల్తీ పాలు తాగి అస్వస్థతకు గురైన బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ప్రభుత్వం తరఫున బాధితులకు అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. రోగుల కుటుంబ సభ్యులకు ధైర్యం కల్పించి, అత్యుత్తమ సదుపాయాలు కల్పించాలని సూచించారు.
News February 28, 2026
సబ్ రిజిస్ట్రార్ నివాసాల్లో ఏసీబీ సోదాలు

రాజమండ్రి, కడియం పరిధిలో ఏసీబీ అధికారులు శనివారం మెరుపు దాడులు చేశారు. సబ్ రిజిస్ట్రార్ లక్ష్మీ, సీనియర్ అసిస్టెంట్ కృష్ణ, సబ్ ఆర్డినేట్ వీరబాబు నివాసాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. కాకినాడ, రాజమండ్రిలోని వీరి ఇళ్లలో ఏసీబీ అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణల నేపథ్యంలో ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది. పలు కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
News February 28, 2026
తూ.గో: పొట్టకూటి కోసం వెళ్తూ.. మృత్యవాత

తూ.గో. జిల్లా దేవరపల్లి మండలం ఎర్నగూడెం జాతీయ రహదారి ఫ్లైఓవర్‌పై లారీ పైనుంచి జారిపడి వ్యక్తి మృతి చెందాడు. విజయనగరం జిల్లా గజపతినగరం(M) పాతబగ్గానికి చెందిన కొందరు సభ్యులు కృష్ణాజిల్లా గుడివాడ మినప చేలు తీత కోసం బయలుదేరి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. నిద్ర మత్తులో ఉండగా లారీ వెనక డోర్ పైనుంచి జారిపడి తలకు దెబ్బ తగిలి సంఘటన స్థలంలోనే మృతి చెందినట్లు తెలుస్తోంది.


