News June 8, 2024
రాజముద్రపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు: మంత్రి కొండా
తెలంగాణ అధికారిక రాజముద్రపై తుది నిర్ణయం తీసుకోలేదని మంత్రి కొండా సురేఖ అన్నారు. హన్మకొండలో మీడియాతో మంత్రి మాట్లాడుతూ.. రాజముద్రలో కీర్తి తోరణం తొలగించలేదని, అందరి అభిప్రాయం మేరకే నిర్ణయం తీసుకుంటామన్నారు. వరంగల్ పార్లమెంట్ పరిధిలోని ప్రజలంతా కాంగ్రెస్ పార్టీ వెంటే ఉన్నారని, కడియం కావ్యను భారీ మెజారిటీతో గెలిపించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు.
Similar News
News November 30, 2024
వరంగల్: ప్రజలకు ప్రత్యక్షంగా సేవలందించే అవకాశం పోలీసులకు మాత్రమే: సీపీ
తొమ్మిది నెలలు శిక్షణను పూర్తిచేసుకుని విధులు నిర్వహించేందుకు సిద్ధమైన 578 మంది కానిస్టేబుళ్లతో సీపీ అంబర్ కిషోర్ ఝా శనివారం సమావేశం నిర్వహించారు. ప్రజలకు ప్రత్యక్షంగా సేవలు అందించే అవకాశం పోలీసులకు మాత్రమే ఉంటుందన్నారు. ప్రజల మన్ననలు పొందేవిధంగా విధులు నిర్వర్తించాలన్నారు. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపారు.
News November 30, 2024
టీజీపీఎస్సీ నూతన ఛైర్మన్‌గా జనగామ వాసి
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొత్త ఛైర్మన్‌గా జనగామ మండలం ఓబుల్ కేశ్వపూర్ గ్రామానికి చెందిన బుర్రా వెంకటేశం నియమితులయ్యారు. డిసెంబర్ 3న ప్రస్తుత ఛైర్మన్ మహేందర్ రెడ్డి పదవీకాలం ముగియనుంది. ఈ మేరకు వెంకటేశంను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు.
News November 30, 2024
వరంగల్: అన్నారం షరీఫ్‌లో వ్యక్తి మృతి
వరంగల్ జిల్లాలో విషాదం జరిగింది. పోలీసుల వివరాలు.. పర్వతగిరి మం. అన్నారం షరీఫ్‌లోని ఓ హోటల్‌లో గోరుకాటి చేరాలు(50) పని చేస్తున్నాడు. పెద్దతండాకు చెందిన ఓ వ్యక్తి తాగిన మైకంలో చేరాలును శనివారం తెల్లవారుజామున ఆటోలో తీసుకెళ్లాడు. విపరీతంగా కొట్టి అన్నారం కెనరా బ్యాంక్ ఎదురుగా పడేశాడు. ఉదయాన్నే అటుగా వెళ్లే అయ్యప్ప భక్తులు గాయాలతో ఉన్న చేరాలును గమనించి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే చనిపోయాడు.