News December 16, 2025
రాజయ్యపేట: మత్స్యకారులతో సీఎం భేటీ వాయిదా

నక్కపల్లి మండలం రాజయ్యపేట మత్స్యకారులతో సీఎం చంద్రబాబు భేటీ వాయిదా పడింది. ఈ విషయాన్ని పోలీస్, రెవెన్యూ అధికారులు తెలియజేసినట్లు మత్స్యకార ప్రతినిధులు పేర్కొన్నారు. మంగళవారం సీఎంతో భేటీ జరగాల్సి ఉంది. బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న మత్స్యకార నాయకులతో హోంమంత్రి అనిత చొరవతో 16న భేటీ ఏర్పాటు చేశారు. అయితే అనివార్య కారణాల వల్ల వాయిదా పడినట్లు మత్స్యకారులు తెలిపారు.
Similar News
News December 21, 2025
రెంజల్: దారుణం.. భార్యను హత్య చేసిన భర్త

రెంజల్ మండల పరిధిలోని బోరిగాంలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి తన భార్యను కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం పోలీసులకు లొంగి పోయాడు. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బస్వారెడ్డి, అతని భార్య మధ్య గొడవ జరిగింది. దీంతో కోపోద్రిక్తుడైన బస్వారెడ్డి తన భార్య రుక్మిణి (54)ని ఇంటి ఆవరణలో హత్య చేశాడు. అనంతరం పోలీసులకు లొంగిపోయాడు. ఘటన స్థలాన్ని బోధన్ రూరల్ సీఐ విజయ్ కుమార్ పరిశీలించారు.
News December 21, 2025
జాతీయ కరాటే పోటీల్లో వర్ధన్నపేట బాలుడికి స్వర్ణం

భోపాల్‌లో నిర్వహించిన 16వ నేషనల్ WFSKO ఓపెన్ కరాటే ఛాంపియన్‌షిప్-2025లో వర్ధన్నపేట పట్టణానికి చెందిన ఎం.మహాజన్ ఉపేంద్ర బంగారు పతకం సాధించాడు. పుస్కోస్ పాఠశాలలో చదువుతున్న ఉపేంద్ర, 10 ఏళ్ల లోపు బాలుర విభాగంలో దేశవ్యాప్తంగా వచ్చిన వందలాది మంది క్రీడాకారులతో తలపడి అద్భుత నైపుణ్యంతో ఈ విజయాన్ని అందుకున్నాడు. జాతీయ స్థాయిలో స్వర్ణ పతకం సాధించిన ఉపేంద్రను పాఠశాల యాజమాన్యం అభినందించింది.
News December 21, 2025
జాతీయ లోక్ అదాలత్‌లో పరిష్కారమైన కేసుల వివరాలు

జాతీయలోక్ అదాలత్‌లో మొత్తం 7,233 కేసులు పరిష్కారమయ్యాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ తెలిపారు.
✓ కొత్తగూడెం: సివిల్ 28, క్రిమినల్ 3561, సైబర్ క్రైమ్ 230, రోడ్డు ప్రమాదాలు 16 మొత్తం-3990
✓ ఇల్లందు: సివిల్ 10, క్రిమినల్ 493, బ్యాంకు 111, మొత్తం-614
✓ భద్రాచలం: క్రిమినల్ 1298, బ్యాంకు 102, మొత్తం-1400
✓ మణుగూరు: క్రిమినల్ 1178, పీఎల్సీ 51, మొత్తం-1229 కేసులు పరిష్కారమయ్యాయి.


