News December 21, 2025
రాజయ్య పేటలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయం: CM

రాజయ్య పేటలో బల్క్‌డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయమని CM చంద్రబాబు మత్స్యకారులకు హామీ ఇచ్చారు. ఎక్కడ ఏర్పాటు చేస్తారో మాత్రం స్పష్టం చేయలేదు. దీంతో మత్స్యకారులు అసంతృప్తికి గురవుతున్నారు. కనీసం వారికి మాట్లాడే అవకాశం కూడా CM ఇవ్వలేదు. CMతో భేటీకి 30 మందిని అధికారులు శనివారం తాళ్లపాలెం తీసుకెళ్లారు. CM వారితో 5 నిమిషాలు మాత్రమే మాట్లాడారు. గ్రామస్థులు చేసిన ఆందోళన.. వారి సమస్యలు తన దృష్టికి వచ్చాయన్నారు.
Similar News
News December 22, 2025
గొల్లప్రోలులో యూపీ కూలీల ఘర్షణ.. ఆరుగురికి గాయాలు

కాకినాడ జిల్లా గొల్లప్రోలు, ఏకే మల్లవరం ప్రాంతాల్లో వరి కోత పనుల కోసం ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన కూలీల మధ్య ఆదివారం ఘర్షణ చోటుచేసుకుంది. మోటార్ సైకిల్ లైట్లు వేయడంతో తలెత్తిన వివాదం చివరికి కూలీలు కర్రలు, రాడ్లతో పరస్పరం దాడులు చేసుకునేదాకా వెళ్లింది. ఈ ఘటనలో ఆరుగురు గాయపడ్డారని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News December 22, 2025
గౌరు చరితకు అనుకోని అవకాశం

నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్ష పదవి ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డికి అనూహ్యంగా దక్కింది. సుమారు 12 మంది నేతలు పోటీ పడగా ఒక దశలో ధర్మవరం సుబ్బారెడ్డి అధ్యక్షుడిగా ఎంపికైనట్లు వార్తలు వచ్చాయి. ఆఖరి నిమిషంలో చరితకు అవకాశం దక్కింది. మరోవైపు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా కాటసాని రాంభూపాల్ రెడ్డి ఉన్నారు. ఆయనను దీటుగా ఎదుర్కొనేలా వ్యూహాత్మకంగా సీఎం చంద్రబాబు చరితను నియమించినట్లు రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.
News December 22, 2025
ఖమ్మం: సర్పంచ్‌ల ప్రమాణస్వీకారానికి సర్వం సిద్ధం

నేడు కొత్త సర్పంచ్లు, వార్డు సభ్యులు నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మూడు విడతల్లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 1,035 జీపీలకు కొత్త పాలక వర్గాలను ఎన్నుకున్నారు. వారి ప్రమాణ స్వీకారానికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దీంతో జీపీ కార్యాలయాల్లో పండుగ వాతవరణం నెలకొంది.


