News December 22, 2024
రాజవొమ్మంగి: చుక్కల జింక మాంసం స్వాధీనం

రాజవొమ్మంగి మండలం ముంజవరప్పాడు గ్రామంలో చుక్కల జింక మాంసం స్వాధీనం చేసుకుని నలుగురు నిందితులపై వన్యప్రాణుల చట్టం-1972 కింద కేసు నమోదు చేసామని అటవీ శాఖ అధికారి రాము ఆదివారం మీడియాకు తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని తెలిపారు. అడవి జంతువుల వేటాడితే కఠిన చర్యలు తప్పవని రాజవొమ్మంగి రేంజ్ అటవీ శాఖ అధికారులు హెచ్చరించారు.
Similar News
News December 25, 2025
నేడు సంసద్ ఖేల్ మహోత్సవ్ ముగింపు వేడుకలు

జిల్లా సంసద్ ఖేల్ మహోత్సవ్-2025 ముగింపు ఉత్సవాలు గురువారం ఘనంగా నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు తెలిపారు. ఆనం కళాకేంద్రంలో మండల, జిల్లా స్థాయి క్రీడా పోటీలు, మారథాన్ ముగిసిన అనంతరం విజేతలకు బహుమతులు ప్రదానం చేయనున్నారు. ఎంపీ దగ్గుబాటి పురందరేశ్వరి ముఖ్య అతిథిగా హాజరై బహుమతులు అందజేస్తారని వెల్లడించారు. ఈ ఉత్సవాల్లో భారీ సంఖ్యలో యువత పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.
News December 25, 2025
ఇంటి దొంగతనాల నివారణకు ‘LHMS’ వాడండి: SP

జిల్లాలో ఇంటి దొంగతనాలను నివారించేందుకు ప్రజలు అత్యాధునిక ‘LHMS’ (లాక్డ్ హౌస్ మోనిటరింగ్ సిస్టం) సాంకేతికతను వినియోగించుకోవాలని SP డి.నరసింహకిషోర్ బుధవారం సూచించారు. ఈసౌకర్యం పూర్తిగా ఉచితమని, ఊర్లకు వెళ్లేవారు పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. విలువైన సామాగ్రిని భద్రపరుచుకోవడంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే 112 నంబర్‌కు ఫోన్ చేయాలని SP ప్రజలకు విజ్ఞప్తి చేశారు.