News December 17, 2025
రాజవొమ్మంగి: ‘ప్రకృతి సాగు విత్తనాలు జాగ్రత్తగా భద్రపరచండి’

రాజవొమ్మంగి మండలం ఊర్లకులపాడులోని ప్రకృతి సాగు బయో రీసెర్చ్ సెంటర్‌ను జిల్లా ప్రకృతి సాగు అధికారి భాస్కరావు బుధవారం పరిశీలించారు. విత్తనాలు ఎలా భద్ర పరచాలో సిబ్బందికి సూచించారు. రానున్న కాలంలో ప్రకృతి సాగు అల్లూరి జిల్లాలో పెరగనున్నదని, అనుగుణంగా విత్తనాలు సిద్ధం చేయాలన్నారు. కో-ఆర్డినేటర్ అప్పలరాజు ఉన్నారు.
Similar News
News December 17, 2025
నార్త్‌లో ఎందుకు.. సౌత్‌లో వేదికల్లేవా? ఫ్యాన్స్ ఫైర్

పొగమంచుతో 4వ టీ20 రద్దు కావడంపై ఫ్యాన్స్ ఫైరవుతున్నారు. శీతాకాలంలో పొగమంచు కురిసే నార్త్ స్టేట్స్‌లో మ్యాచ్‌లు షెడ్యూల్ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. మంచు సమస్య ఉండే వేదికల్లో రాత్రి 7గంటలకు కాకుండా మధ్యాహ్నం మ్యాచ్‌లు నిర్వహిస్తే బాగుంటుందని సూచిస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో పొగమంచు సమస్య తక్కువని ఇక్కడ క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహించే ఛాన్స్‌లు పరిశీలిస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు.
News December 17, 2025
శ్రీకాకుళం: టుడే టాప్ న్యూస్ ఇవే

➤SKLM: ఆర్టీసీ కార్గో ద్వారా నేరుగా ఇళ్లకు పార్సిల్స్
➤సరుబుజ్జిలి: ఆర్టీసీ బస్సు ఢీకొని వృద్ధుడు మృతి
➤మహిళల ఆర్ధిక ఎదుగుదల ముఖ్యం: ఎమ్మెల్యే కూన
➤ఉపాధి హామీ పేరు మార్పు అన్యాయం: మాజీ కేంద్ర మంత్రి కిల్లి
➤ పలాసలో వివాదాలకు కారణం అవుతున్న ప్రభుత్వ భూములు
➤టెక్కలి: పెద్దసానలో కొండచిలువ కలకలం
➤ఎచ్చెర్ల: రోడ్డు పనులు పరిశీలించిన ఎమ్మెల్యే
News December 17, 2025
పాన్‌గల్: మాజీమంత్రి సొంతూరులో కాంగ్రెస్ గెలుపు

మాజీమంత్రి నిరంజన్ రెడ్డి సొంతూరు పాన్‌గల్ మండలం కొత్తపేట గ్రామ సర్పంచ్‌గా కాంగ్రెస్ మద్దతుదారురాలు గెలుపొందారు. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి రాధమ్మ సమీప ప్రత్యర్థి, బీఆర్ఎస్ అభ్యర్థిపై 171 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. మాజీ మంత్రి సొంతూరులో విజయం సాధించడం పట్ల కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు సంబరాలు అంబరానంటాయి. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా పాలనలో గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని రాధమ్మ తెలిపారు.


