News October 1, 2024
రాజస్థాన్‌లో HYD పోలీస్ ఆపరేషన్ SUCCESS

రాజస్థాన్‌లో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు భారీ ఆపరేషన్ నిర్వహించారు. రాజస్థాన్ కేంద్రంగా చేసుకుని సైబర్ నేరాలకు పాల్పడుతున్న కేటుగాళ్లకోసం రిక్కీ నిర్వహించారు. పక్కా ప్లాన్‌తో వారి స్థావరాలపై మెరుపుదాడి చేసి 27 మందిని అరెస్ట్ చేశారు.
Similar News
News March 2, 2026
HYD: ఇవి తింటే.. గుండె పదిలం

ఆరోగ్యకర జీర్ణ ప్రక్రయకు ఫైబర్ అధికంగా ఉండే ఆహారం అవసనమని రామంతపూర్ డా.అంబికా తెలిపారు. ఫైబర్ రిచ్ ఫుడ్స్ శరీరంలో కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో సహాయపడతాయి. అరటి, యాపిల్, పియర్, అవకాడో, బ్లాక్ బీన్స్, శనగలు, మినుముల వంటి పదార్థాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ఆకుకూరలు, పప్పుధాన్యాలు, విత్తనాలు రోజువారీ ఆహారంలో చేర్చితే గుండె ఆరోగ్యం మెరుగవుతుందని పేర్కొన్నారు.
News March 1, 2026
Zero Discrimination Day.. Way2News Message..!

నేడు ప్రపంచ వివక్ష వ్యతిరేక దినోత్సవం. మనిషిని మనిషిగా గౌరవించడమే అసలైన నాగరికత. రంగు, రూపం, కులం, మతం.. ఇలా ఏ కారణంతోనైనా ఎవరినీ తక్కువ చేసి చూడటం నేరం. ముఖ్యంగా ఉద్యోగాల్లో అందరికీ సమాన అవకాశాలు దక్కాలి. మన ఆలోచనల్లో మార్పు వస్తేనే సమాజం బాగుపడుతుంది. ఎదుటివారిని చిన్నచూపు చూడటం మానేసి ప్రేమాభిమానాలతో బతుకుదాం. 2026 థీమ్ ప్రకారం ‘మనుషులకే మొదటి ప్రాధాన్యం’ ఇద్దాం. ఇందుకు మనమే తొలి అడుగు వేద్దాం.
News March 1, 2026
HYD: Way2Newsలో కథనం.. అధికారుల్లో చలనం

MMC ఘట్‌కేసర్ సర్కిల్ ముత్వెల్లిగూడలో నీటి లీకేజీపై Way2News కథనానికి అధికారులు స్పందించి మరమ్మతులు చేయించారు. ‘<<19260987>>నమ్మండి.. ఇది రోడ్డే..!<<>>’ శీర్షికన శనివారం పబ్లిష్ అయిన కథనంతో HMWSSB మల్కాజిగిరి ED పంకజ, CGM (E) సంతోష్ సదరు ప్రాంతాన్ని సందర్శించారు. 200mm డయా పైపు నీటి లీకేజీ సమస్యను పరిష్కరించారు. స్పందించి సమస్య తీర్చిన అధికారులకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.


