News November 16, 2025
రాజస్థాన్ చీఫ్ సెక్రటరీగా తెలుగు వ్యక్తి

రాజస్థాన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా తెలుగు IAS ఆఫీసర్ వోరుగంటి శ్రీనివాస్ నియమితులయ్యారు. కేంద్ర సర్వీసుల్లో పని చేస్తున్న ఈయనను RJ ప్రభుత్వం డిప్యుటేషన్‌పై రప్పించి సీఎస్ బాధ్యతలు అప్పగించింది. ఈయన 1966లో అరకు లోయలో జన్మించారు. భద్రాచలం, ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నారు. 1989లో ఎంటెక్ పూర్తయ్యాక IASకు ఎంపికయ్యారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు మనవరాలిని శ్రీనివాస్ వివాహం చేసుకున్నారు.
Similar News
News November 16, 2025
డ్రైవర్ అన్నలూ.. ప్రాణాలు తీయకండి!

రోడ్డుపై నిలిపి ఉంచిన వాహనాల వల్ల జరిగే ప్రమాదాల్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. వెహికల్ బ్రేక్ డౌన్ అవ్వడం, ఇతర పనుల వల్ల కొందరు డ్రైవర్లు రోడ్డు పక్కనే బండ్లు ఆపుతారు. కనీసం సిగ్నల్ లైట్లు వేయరు. రేడియం రిఫ్లెక్టర్లు ఉండవు. దీనివల్ల రాత్రి వేళల్లో వెనుక నుంచి వస్తున్న వాహనాలకు అవి కనిపించకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. చలికాలంలో పొగమంచు వల్ల ఇంకా జాగ్రత్తగా ఉండాలి.
Share it
News November 16, 2025
RRBలో JE ఉద్యోగాలు.. దరఖాస్తు గడువు పొడిగింపు

RRB జూనియర్ ఇంజినీర్(JE) పోస్టులకు దరఖాస్తు గడువును పొడిగించింది. ఈ నెల 30తో గడువు ముగియనుండగా.. DEC 10 వరకు పొడిగించింది. 2,569 పోస్టులకు గాను చెన్నై, జమ్మూ, శ్రీనగర్ రీజియన్‌లో 16 పోస్టులు పెంచడంతో 2,585కు చేరాయి. ఇప్పటికే అప్లై చేసుకున్నవారు పోస్టు ప్రాధాన్యత , రైల్వేజోన్ సవరణ ఎలాంటి ఫీజు లేకుండా NOV25 – DEC 10 వరకు చేసుకోవచ్చు.
News November 16, 2025
పొదచిక్కుడులో కాయతొలిచే పురుగు నివారణ

పొద చిక్కుడు పూత, కాయ దశల్లో కాయతొలిచే పురుగు ఆశించి కాయలోని పదార్థాలను తినేస్తుంది. దీని వల్ల కాయ నాణ్యత, దిగుబడి తగ్గిపోతుంది. కాయతొలిచే పురుగు నివారణకు ఫ్లూబెండమైడ్ 39.35% ఎస్.సి. 60 మి.లీ. లేదా క్లోరంత్రానిలిప్రోల్ 18.5% ఎస్.సి. 60 మి.లీ. లేదా స్పైనోశాడ్ 45% ఎస్.సి. 60 మి.లీ.తో పాటు జిగురు 100 మి.లీ. కలిపి ఎకరానికి సరిపడా 200 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి.


