News September 10, 2025

రాజాంలో రేపు జాబ్ మేళా

image

రాజాం ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో రేపు జాబ్ మేళా నిర్వహిస్తున్నామని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ప్రశాంతకుమార్ తెలిపారు. 10th, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్, ఏదైనా పీజీ చదివి వయసు 18-35లోపు ఉన్న యువతీ, యువకులు అర్హులన్నారు. 12 బహుళజాతి కంపెనీలు జాబ్ మేళాకు హాజరవుతున్నాయని, ఆసక్తి ఉన్నవారు https://naipunyam.ap.gov.in వెబ్ సైట్లో వివరాలు నమోదు చేసుకోవాలన్నారు.

Similar News

News September 10, 2025

మెంటాడ: పురుగుమందు తాగి ఆత్మహత్య

image

మెంటాడ మండలం గుర్ల గ్రామంలో మద్యానికి బానిసైన కుమిలి సంతోశ్ మంగళవారం రాత్రి పురుగుమందు తాగినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వెంటనే ఆసుపత్రిలో చేర్చామన్నారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు చెప్పారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో ఆండ్ర ఎస్‌ఐ సీతారాం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News September 10, 2025

ఢిల్లీ చేరిన జిందాల్ భూ నిర్వాసితులు

image

ఎస్.కోట మండలం బొడ్డవరలో 80 రోజులుగా నిరసన తెలిపిన జిందాల్ భూ నిర్వాసితులు చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టడం తెలిసిందే. ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు చల్లా జగన్ ఆధ్వర్యంలో సోమవారం ఢిల్లీకి బయలుదేరిన వీరు బుధవారం చేరుకున్నట్లు జగన్ తెలిపారు. ప్రభుత్వం గిరిజన సమస్యలపై స్పందించకపోవడంతో ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వానికి, మానవ హక్కుల సంఘాలకు గిరిజనుల సమస్యలను తెలియపరచనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

News September 9, 2025

VZM: ‘ఎరువులు అక్రమ నిల్వలు చేస్తే చర్యలు తప్పవు’

image

ఎరువులు అక్రమ నిల్వలు చేసే వారిపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అంబేడ్కర్ హెచ్చరించారు. మంగళవారం నిర్వహించిన జిల్లా కలెక్టర్ ఫోన్ ఇన్ కార్యక్రమంలో 11 మంది రైతులు కలెక్టర్‌తో మాట్లాడారు. జిల్లాలో 400 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని, రానున్న 3 రోజుల్లో ఓ కంపెనీ ద్వారా 1,000 మెట్రిక్ టన్నులు, కోరమాండల్ కంపెనీ ద్వారా 1000 మెట్రిక్ టన్నులు వస్తాయన్నారు. వీటిని 25వ తేదీ లోపు అందజేస్తామన్నారు.