News March 5, 2025
రాజాం: భోజనం చేసి కుప్పకూలిపోయిన యువకుడు

అకస్మాత్తుగా గుండె పోటుతో యువకుడు మృతి చెందిన ఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. రాజాం మున్సిపాలిటీ పరిధిలో గాయత్రీ కాలనీకి చెందిన శ్రీనివాస్(30) భోజనం చేసిన కాసేపటికే కుప్పకూలిపోవడంతో కుటుంబ సభ్యులు రాజాం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే గుండెపోటుతో మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. యువకుడు మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Similar News
News March 5, 2025
మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి: SP

జిల్లా కేంద్రంలో మార్చి 8న చేపట్టే మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను SP వకుల్ జిందాల్ ఆదేశించారు. స్థానిక మహిళ పీఎస్‌ను బుధవారం సందర్శించి ఏర్పాట్లపై ఆరా తీశారు. జిల్లా కేంద్రంలోని మహిళా పోలీసు స్టేషను వద్ద మార్చి 8న నిర్వహించనున్న మహిళా దినోత్సవ ర్యాలీలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొనే విధంగా చర్యలు చేపట్టాలన్నారు.
News March 5, 2025
డ్రోన్స్ పర్యవేక్షణలో ప్రశాంతంగా అమ్మవారి జాతర: SP

చీపురుపల్లిలో జరిగిన శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి జాతరను డ్రోన్స్ పర్యవేక్షణ ప్రశాంతంగా ముగిసిందని ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. బుధవారం తన కార్యాలయంలో ఎస్పీ మాట్లాడుతూ.. ముందస్తు చర్యలతో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూశామన్నారు. భక్తులు సులభతరంగా అమ్మవారిని దర్శించుకొనే విధంగా క్యూలైన్లను ఏర్పాటు చేయడం, త్వరితగతిన భక్తులను వరుస క్రమంలో పంపేటట్లు బందోబస్తు నిర్వహించామన్నారు.
News March 5, 2025
కర్మయోగి పోర్టల్ ద్వారా ఆన్‌లైన్ శిక్షణ పూర్తిచేసుకోవాలి: కలెక్టర్

జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులంతా మార్చి 16వ తేదీలోగా ఐగాట్ కర్మయోగి పోర్టల్ ద్వారా తప్పనిసరిగా ఆన్‌లైన్ శిక్షణ పూర్తిచేసుకోవాలని కలెక్టర్ డా.బీఆర్ అంబేడ్కర్ ఆదేశించారు. ప్రభుత్వ ఉద్యోగుల శక్తి సామర్ధ్యాలను పెంచడానికి కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆన్‌లైన్ శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు.