News March 5, 2025
రాజాం: భోజనం చేసి కుప్పకూలిపోయిన యువకుడు

అకస్మాత్తుగా గుండె పోటుతో యువకుడు మృతి చెందిన ఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. రాజాం మున్సిపాలిటీ పరిధిలో గాయత్రీ కాలనీకి చెందిన శ్రీనివాస్(30) భోజనం చేసిన కాసేపటికే కుప్పకూలిపోవడంతో కుటుంబ సభ్యులు రాజాం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే గుండెపోటుతో మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. యువకుడు మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Similar News
News November 13, 2025
NTR: మాజీ మంత్రి జోగి రమేశ్ రిమాండ్ పొడిగింపు

ఇబ్రహీంపట్నంలో చర్చనీయాంశమైన నకిలీ మద్యం కేసులో నిందితులకు విజయవాడ ఎక్సైజ్ కోర్టు రిమాండ్ పొడిగించింది. ఈ నెల 25 వరకు రిమాండ్‌లో ఉంచేందుకు అనుమతించింది. నెల్లూరు జైలులో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న జోగి రమేశ్, రామును పోలీసులు జడ్జి ఎదుట హాజరుపరిచారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం నేడు రిమాండ్ పొడిగించింది.
News November 13, 2025
మిథున్ రెడ్డికి జనసేన కౌంటర్

మిథున్ రెడ్డి సోషల్ మీడియాలో బుకాయిస్తే ఆయన తండ్రి <<18276752>>ఆక్రమణలు <<>>సక్రమం కావని జనసేన పేర్కొంది. ‘1968 సెప్టెంబర్ 16న మంగళంపేట ఫారెస్ట్ గెజిట్ ప్రకారం 76ఎకరాలున్న భూమి 103ఎకరాల 98సెంట్లు ఎలా అయ్యిందో చెబుతారా మిథున్ రెడ్డి. అడవిని ఎలా కబ్జా చేశారో మీ తండ్రిని అడగండి. 32ఎకరాల 63సెంట్లు అడవిని కబ్జా చేసేసినంత ఈజీ కాదు చట్టం నుంచి తప్పించుకోవడం. కాసేపట్లో మీ కబ్జా చిట్టా బయటికి వస్తుంది’ అని ట్వీట్ చేసింది
News November 13, 2025
ఉంగుటూరు: ‘రైతులకు వ్యవసాయం చేసుకునేందుకు అనుమతివ్వాలి’

ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు గురువారం కలెక్టర్ కె.వెట్రి సెల్విని, అటవీ శాఖ అధికారులను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..దశబ్దాలుగా కొల్లేరులో వ్యవసాయం చేసుకొని జీవనోపాధి సాగిస్తున్న రైతులను కొల్లేరులో వ్యవసాయం చెయ్యటానికి వీలు లేదన్నారు. గత కొన్ని రోజులుగా అటవీ శాఖ అధికారులు అడ్డుకోవటంతో అనేక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. రైతులు వ్యవసాయం చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు.


