News July 3, 2024

రాజాం: మంత్రి శ్రీనివాస్‌తో ఎమ్మెల్యే కళా భేటీ

image

రాష్ట్ర ఎంఎస్ఎమ్ఈ, సెర్ప్, ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌తో చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటర్రావు బుధవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఉత్తరాంధ్రలోని పలు సమస్యలపై ఇరువురు చర్చించారు. అలాగే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మొట్టమొదటిసారిగా తమ నివాసానికి విచ్చేసిన శ్రీనివాస్‌ను కళా ఘనంగా సన్మానించారు.

Similar News

News March 2, 2026

SKLM: ఓపెన్ స్కూల్ ఇంటర్ పరీక్షలకి 895 మంది హాజరు

image

జిల్లా వ్యాప్తంగా సోమవారం జరిగిన ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఇంగ్లీష్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని జిల్లా విద్యాశాఖాధికారి పి.రవిబాబు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షల నిర్వహణకు సంబంధించి జిల్లాలో 6 కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఎక్కడ ఎటువంటి మాస్ కాపీయింగ్‌కు, అక్రమాలకు తావులేకుండా ఇద్దరు ఫ్లయింగ్ స్క్వాడ్లు, 6 సిట్టింగ్ స్క్వాడ్లతో నిరంతర పర్యవేక్షణ చేశారన్నారు.

News March 2, 2026

SKLM: ఇంటర్ పరీక్షలకు 512 మంది విద్యార్థులు గైర్హాజరు

image

శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా 71 ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాల్లో సోమవారం జరిగిన పరీక్షలకు 512 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు అధికారులు తెలిపారు. ఇందులో జనరల్ సబ్జెక్టులకు సంబంధించి మొత్తం 11,551 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 11,164 మంది రాశారు. ఒకేషనల్ సబ్జెక్టులకు సంబంధించి మొత్తం 1,510 మందికి గాను 1,385 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఎటువంటి మాల్ ప్రాక్టీస్ జరగలేదు.

News March 2, 2026

శ్రీకాకుళం: ASW ఇంటిపై ఏసీబీ సోదాలు

image

శ్రీకాకుళం బీసీ సంక్షేమ శాఖ ASW జి.బాల ముకుందం ఇంటిపై అవినీతి నిరోధక శాఖ అధికారులు సోమవారం సోదాలు నిర్వహించారు. ఏసీబీ డీఎస్పీ సత్యనారాయణ ఆధ్వర్యంలోని బృందం శ్రీకాకుళం పట్టణంలోని డీసీసీబీ కాలనీలోని ఇంట్లో ఈ తనిఖీలు నిర్వహించారు. ఆస్తి పత్రాలు, బంగారం నిల్వలు వంటివి తనిఖీలు చేసినట్లు సమాచారం. అవినీతి ఆరోపణలపై వచ్చిన ఫిర్యాదులు ఆధారంగా సోదాలు చేసినట్లు సమాచారం.