News May 13, 2024
రాజాం: విధి నిర్వహణలో కుప్పకూలి పడిపోయిన టీచర్

రాజాం ప్రాథమిక ఉన్నత పాఠశాలలో పోలింగ్ కేంద్రంలో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న టీచర్ రమణ ఉష్ణోగ్రత తీవ్రత, ఒత్తిడికి గురై సోమవారం అక్కడకక్కడే కుప్పకూలిపోయారు. వెంటనే తోటి సిబ్బంది హుటాహుటిన రాజాం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్య కోసం విజయనగరం తీసుకెళ్లారు. టీచర్ రమణ విజయనగరం వాసి.
Similar News
News October 28, 2025
పలాస: జిల్లా మీదుగా వెళ్లే పలు రైళ్లు రద్దు

మొంథా తుపాన్ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా మీదుగా వెళ్లే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు మంగళవారం రైల్వే అధికారులు వెల్లడించారు. జిల్లా మీదుగా వెళ్లే భువనేశ్వర్-బెంగళూరు(ప్రశాంతి ఎక్స్‌ప్రెస్), భువనేశ్వర్-హైదరాబాద్(విశాఖ ఎక్స్‌ప్రెస్), కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌తో పాటు విశాఖ-బరంపురం(ఇంటర్ సీటీ) ఎక్స్‌ప్రెస్, పలాస-విశాఖ(మెమో) ప్యాసెంజర్ రైళ్లు రద్దు చేశారు. రైల్వే ప్రయాణీకులు గమనించాలని కోరారు.
News October 28, 2025
ఒకడు ఇళ్ల తలుపులు.. మరొకడు బీరువా విరగ్గొట్టడంతో దిట్ట!

శ్రీకాకుళం జిల్లాలో రాత్రి పూట దొంగతనాలు చేస్తున్న ముఠాను <<18122311>>పోలీసులు పట్టుకున్న సంగతి తెలిసిందే<<>>. వీరు కాకినాడకు చెందిన వారు. వేంకటేశ్వర్లు, ప్రసాద్ పదేళ్లుగా దొంగతనాలు చేస్తున్నారు. ఒకరు తాళాలు వేసిన ఇళ్ల తలుపులు విరగ్గొట్టడంలో ఎక్స్‌పర్ట్ అయితే మరొకడు బీరువా తలుపులు తెరవడంలో దిట్ట. వీరికి కాకినాడ సెంట్రల్ జైలులో క్రిమినల్ మోహనరావు పరిచమయ్యాడు. వీరంతా కలిసి జిల్లాపై కన్నేసి వరుస దొంగతనాలు చేశారు.
News October 28, 2025
శ్రీకాకుళం జిల్లా మీదుగా నడిచే 20 రైళ్లు రద్దు

తుఫాన్ ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా మీదుగా నడిచే 20 రైళ్లను రద్దు చేస్తున్నట్లు ఈస్ట్ కోస్టు రైల్వే జీఎం పరమేశ్వర ఒక ప్రకటనలో వెల్లడించారు. ప్రయాణికుల భద్రత మేరకు అక్టోబర్ 27, 28, 29 తేదీల్లో రైళ్ల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు చెప్పారు. ప్రయాణికులు గమనించాలని రైల్వే అధికారులను సూచించారు.


