News October 8, 2025
రాజాం: 24 గంటల వ్యవధిలో తండ్రి, కొడుకు మృతి

రాజాం మండలం బొద్దాం గ్రామానికి చెందిన రాష్ట్రస్థాయి డోలక్ వాయిద్యం ప్రసిద్ధుడు కొన్న బాలకృష్ణ సోమవారం అనారోగ్యంతో మృతి చెందారు. తన తండ్రి మరణం తట్టుకోలేక 2వ కుమారుడు అప్పలరాజు (32) మంగళవారం మరణించాడు. 24 గంటల వ్యవధిలో ఒకే కుటుంబంలో ఇద్దరు మరణించడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
Similar News
News October 8, 2025
VZM: ‘వసతి గృహ విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ’

జిల్లాలోని అన్ని వసతి గృహాల్లో విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. విద్యాశాఖ వివిధ విభాగాల అధికారులతో బుధవారం నిర్వహించిన టెలికాన్ఫెరెన్స్‌లో ఆయన మాట్లాడారు. విద్యార్థులకు వేడి నీరు, పరిశుభ్రమైన ఆహారం అందించాలని, ప్రతిరోజూ ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు పౌష్టికాహారం అందించాలన్నారు.
News October 8, 2025
అమ్మ సంబరాన్ని సాంప్రదాయబద్ధంగా జరిపించాం: EO

పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం విజయవంతంగా ముగిసిందని ఆలయ సహాయ కమిషనర్ కె.శిరీష బుధవారం తెలిపారు. సిరిమానోత్సవం సాఫీగా, సంప్రదాయబద్ధంగా నిర్వహించడానికి కృషిచేసిన ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు, భక్తులందరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు. అమ్మవారి సిరిమాను సంబరాన్ని సంప్రదాయబద్ధంగా, ప్రశాంతంగా నిర్వహించామన్నారు.
News October 8, 2025
సిరిమాను చెక్క కోసం బారులు తీరిన భక్తులు

ఉత్తరాంధ్ర కల్పవల్లి పైడితల్లి అమ్మవారి సిరిమాను మహోత్సవం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా బుధవారం సిరిమాను చెక్కలను తీసుకొని వెళ్లడానికి భక్తులు బారులు తీరారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సిరిమాను చెక్కలను తీసుకెళ్లిన భక్తులు వారి ఇంటిలో ఉంచుకుంటారు. దీంతో సుఖసంతోషాలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.