News March 25, 2025
రాజానగరం: మాతృత్వాన్ని చాటుకున్న విసీ ప్రసన్న శ్రీ

ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం విద్యార్థులను తన పిల్లలుగా భావిస్తానని చెప్పే వీసీ ఆచార్య ఎస్ ప్రసన్న శ్రీ .. మరోసారి తన మాతృ హృదయాన్ని చాటుకున్నారు. సోమవారం రాజమండ్రి నుంచి మధ్యాహ్నం వస్తుండగా.. చాళుక్య ద్వారం వద్ద ఒక తల్లి తన బిడ్డను తీసుకొని మండుటెండలో నడుస్తూ వీసీకి కనిపించారు. తన కారు ఆపి, మండుటెండలో వస్తున్న ఆ బిడ్డను తీసుకుని లాలించి తన ఛాంబర్‌కు తీసుకువచ్చారు. ఆమె పని ముగిశాక అప్పగించారు.
Similar News
News August 17, 2025
యథావిధిగా పీజీఆర్ఎస్ కార్యక్రమం: కలెక్టర్

ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి నెల నిర్వహించే పీజీఆర్ఎస్ (ప్రజా సమస్యల పరిష్కారం) కార్యక్రమం ఈ నెల 18 సోమవారం యథావిధిగా జరుగుతుందని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి తెలిపారు. ప్రజలు తమ అర్జీలను డివిజన్, మండల కేంద్రాల కార్యాలయాల్లోనే అందజేయవచ్చని ఆమె పేర్కొన్నారు. ప్రజలు ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకుని సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు.
News August 16, 2025
తూ.గో: విలీన మండలాలకూ ఫ్రీ బస్సులు వర్తిస్తాయి: డీపీటీఓ

పోలవరం విలీన మండలాలైన వీఆర్ పురం, కూనవరం, ఎటపాక, చింతూరు ప్రాంతాల్లోనూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వర్తిస్తుందని తూ.గో. జిల్లా ఆర్టీసీ డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్ (డీపీటీఓ) వై.ఎస్.ఎన్. మూర్తి స్పష్టం చేశారు. అంతర్‌రాష్ట్ర సర్వీసులు మినహా మిగిలిన అన్ని బస్సుల్లోనూ ఈ పథకం అందుబాటులో ఉంటుందని ఆయన తెలిపారు. ఆయా ప్రాంతాల మహిళల అభ్యంతరాలపై ఆయన ఈ వివరణ ఇచ్చారు.
News August 16, 2025
తూ. గో: ఘాట్ రోడ్లలోనూ ఉచిత బస్సులు

రాష్ట్రంలోని ఘాట్ రోడ్లలో కూడా మహిళలు ఇక ఉచితంగా ప్రయాణించవచ్చని తూ.గో ఆర్టీసీ డీపీటీఓ వై.సత్యనారాయణ మూర్తి తెలిపారు. భద్రతా కారణాల వల్ల మొదట నిలిపివేసినప్పటికీ, తాజాగా ప్రభుత్వం ఈ పథకాన్ని కొనసాగించాలంటూ ఆదేశాలు ఇచ్చిందన్నారు. రాజమండ్రి-భద్రాచలం, శ్రీశైలం వంటి మార్గాల్లో ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందని తెలిపారు.