News February 20, 2025
రాజానగరం : రెండు లారీల మధ్య నలిగిపోయి వ్యక్తి మృతి

రాజానగరం పోలీస్ స్టేషన్ పరిధిలోని కొంతమూరు గామన్ బ్రిడ్జిపై బుధవారం రాత్రి జరిగిన ప్రమాదంలో డ్రైవర్ మృతి చెందాడు. విశాఖపట్నం నుంచి మహారాష్ట్రకు ఇనుప ఊచలు లోడుతో వెళ్తున్న లారీని డ్రైవర్ శ్రీనివాసరావు(45) రోడ్డు పక్కకు ఆపి, టైర్లలో గాలి చెక్ చేస్తుండగా మరో లారీ ఢీకొంది. ప్రమాదంలో రెండు లారీల మధ్య నలిగి, అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడని ఎస్ఐ మనోహర్ తెలిపారు.
Similar News
News December 20, 2025
బాపట్లలో పల్స్ పోలియోకు సర్వం సిద్ధం: DMHO

జిల్లాలో 0-5 ఏళ్ల లోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేసేందుకు జిల్లా వైద్యఆరోగ్య శాఖ యంత్రాంగం పూర్తి స్థాయిలో సిద్ధమైందని శనివారం బాపట్ల DMHO డాక్టర్ ఎస్. విజయమ్మ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,111 పోలియో బూత్‌లు, 4,662 మంది వ్యాక్సినేటర్లు, 113 మంది రూట్ సూపర్వైజర్లను నియమించామన్నారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల వద్ద 42 ట్రాన్సిట్ బూత్‌లు, 67 మొబైల్ టీమ్‌లు ఏర్పాటు చేశామన్నారు.
News December 20, 2025
IIT రూర్కీలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

<
News December 20, 2025
ఒంగోలులో రూ.40వేల వేతనంతో జాబ్స్..!

ఒంగోలులోని జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈనెల 23వ తేదీ ఉదయం 10 గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి రమాదేవి తెలిపారు. ఈ జాబ్ మేళాకు ప్రముఖ కంపెనీలు హాజరుకానున్నట్లు చెప్పారు. 10th నుంచి ఏదైనా డిగ్రీ చదివిన 18-35 ఏళ్లలోపు వయస్సు గలవారు అర్హులు. జీతం రూ.40వేల వరకు పొందే అవకాశం ఉందన్నారు.


