News January 3, 2025
రాజానగరం హైవేపై రోడ్డు ప్రమాదం.. యువకుడి మృతి
రాజానగరం గైట్ కళాశాల వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తొర్రేడుకు చెందిన భరత్ చంద్ర (20) మృతి చెందాడు. స్నేహితుడి నాగేంద్రతో కలసి బైక్‌పై రాజానగరం నుంచి రాజమండ్రి వెళుతూ ముందు వెళ్తున్న లారీని తప్పించే క్రమంలో బైక్ హేండిల్ లారీకి తగిలి రోడ్డుపై పడ్డారు. అదే సమయంలో వెనుక నుంచి వస్తున్న మరో లారీ భరత్‌పై నుంచి వెళ్లిపోవడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు.
Similar News
News January 6, 2025
సామర్లకోట: ‘సంక్రాంతికి స్పెషల్ ట్రైన్స్’
సంక్రాంతి సందర్భంగా రైల్వే శాఖ స్పెషల్ ట్రైన్స్ ఏర్పాటు చేసినట్లు సామర్లకోట స్టేషన్ అధికారి రమేష్ తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కాకినాడ, సికింద్రాబాద్, చర్లపల్లి, తిరుపతి, వికారాబాద్, కాచిగూడ, తదితర ప్రాంతాలకు సంక్రాంతి సందర్భంగా ప్రయాణించే ప్రయాణికుల కోసం స్పెషల్ ట్రైన్స్ రైల్వే శాఖ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News January 5, 2025
కాకినాడ: గేమ్ ఛేంజర్ ఈవెంట్‌కు వెళ్లొస్తూ ప్రమాదం.. ఇద్దరి మృతి
గేమ్ ఛేంజర్ ఈవెంట్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా జరిగిన ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. రంగంపేట(M) ఏడీబీ రోడ్డులో కార్గిల్ ఫ్యాక్టరీ సమీపంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బైక్‌పై వస్తుండగా ఐచర్ వ్యాన్ ఢీకొట్టడంతో మణికంఠ(23) అక్కడికక్కడే మృతి చెందగా తీవ్రంగా గాయపడిన చరణ్ GGHకు తరలిస్తుండగా మృతి చెందాడు. మృతులు కాకినాడకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేశారు.
News January 5, 2025
రేపటి నుంచి ప్రత్యేక ఆధార్ క్యాంపులు: కలెక్టర్ ప్రశాంతి
తూర్పు గోదావరి జిల్లాలో 0-6 ఏళ్ళ మధ్య వయస్సు కలిగిన పిల్లలకి ఆధార్ నమోదు కార్యక్రమానికి ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ప్రశాంతి ఆదివారం తెలిపారు. జిల్లాలో సుమారు 17,000 మంది పిల్లలు వివిధ కారణాలవల్ల ఆధార్ సంఖ్య లేని వారు ఉండే అవకాశం ఉందని అంచనా వేయడం జరిగిందన్నారు. సోమవారం నుంచి 10వ తేదీ వరకు 0-6 మధ్య వయసు ఉన్న పిల్లలకు ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహిస్తామన్నారు.