News July 6, 2025
రాజాపూర్: గొంతులో పూరి ఇరుక్కుని యువకుడి మృతి

జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండలంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. ఖానాపూర్‌కు చెందిన బ్యాగరి కిరణ్ కుమార్ (25) వ్యవసాయ పొలంలో పూరీలు తింటుండగా గొంతులో ఇరుక్కొనడం వల్ల ఊపిరాడక మృతి చెందాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
Similar News
News July 6, 2025
భవాని దేశానికే గర్వకారణం: హోం మంత్రి అనిత

కజకిస్థాన్‌లో జరుగుతున్న ఏషియన్ యూత్ జూనియర్ వెయిట్ లిఫ్టింగ్‌లో మూడు స్వర్ణ పథకాలు సాధించిన విజయనగరం జిల్లా కొండకరకాం గ్రామానికి చెందిన రెడ్డి భవానీని హోంమంత్రి వంగలపూడి అనిత అభినందించారు. ఈమె దేశానికి గర్వకారణం అని మంత్రి పేర్కొన్నారు. ఆమె ఎంతోమందికి స్ఫూర్తిదాయకం అన్నారు. భవాని మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. తగిన ప్రోత్సాహం అందిస్తామన్నారు.
News July 6, 2025
బిర్యానీ తింటూ కూల్ డ్రింక్ తాగితే..

కొందరు బిర్యానీ తింటూ కూల్ డ్రింక్ తాగేందుకు ఇష్టపడతారు. అలా చేస్తే తొందరగా జీర్ణం అవుతుందని అపోహపడతారు. అయితే ఆ అలవాటు ఆరోగ్యానికి మంచిది కాదని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. కూల్ డ్రింక్స్ వల్ల జరిగే కార్బొనేషన్ జీర్ణప్రక్రియను దెబ్బతీస్తుందని తెలిపారు. అధిక మొత్తంలో ఉండే చక్కెరతో బరువు పెరుగుతారని చెప్పారు. కూల్ డ్రింక్స్ బదులు మజ్జిగ తీసుకుంటే మేలని సూచిస్తున్నారు.
News July 6, 2025
విశాఖలో భక్తి శ్రద్ధలతో మొహరం

విశాఖలో మొహరం వేడుకలకు ఆదివారం సాయంత్రం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. చెంగలరావుపేటలోని హుసేని మసీదు ఆధ్వర్యంలో షియా ముస్లింలు హజరత్ ఇమామ్ హుస్సేన్ మరణానికి సానుభూతిగా రక్తం చిందించారు. ఈ కార్యక్రమంలో షియా ముస్లింలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.