News February 16, 2025
రాజాపూర్: రైలు ఢీకొని గుర్తు తెలియని మహిళ మృతి

రైలు ఢీకొని గుర్తు తెలియని మహిళ మృతి చెందిన ఘటన రాజాపూర్ మండలంలో ఆదివారం జరిగింది. రైల్వే హెడ్ స్టేషన్ మాస్టర్ వెంకట్రావు వివరాల ప్రకారం.. మండలంలోని ముదిరెడ్డిపల్లి గ్రామ శివారులో రైలు ఢీకొని ఓ మహిళ (30) మృతి చెందింది. మృతదేహాన్ని MBNR ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్టేషన్ మాస్టర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రైల్వే ఎస్ఐ అక్బర్ తెలిపారు. మహిళ ఆచూకీ తెలిస్తే 98480 90426 తెలపాలన్నారు.
Similar News
News March 12, 2025
GWL: ప్రేమ వ్యవహారం.. అబ్బాయి తల్లిపై దాడి

ప్రేమ వ్యవహారంలో అబ్బాయి తల్లిని చెట్టుకు కట్టేసి దాడి చేసిన ఘటన ఇటిక్యాల మం. వేముల గ్రామంలో వెలుగుచూసింది. పోలీసుల వివరాలు.. తన కుమార్తెను గ్రామానికి చెందిన యువకుడు ప్రేమించి తీసుకెళ్లాడని ఆ యువకుడి తల్లి మారెమ్మపై యువతి తరఫున వారు దాడిచేశారు. స్థానికులు పోలీసులకు తెలపగా వారు చేరుకుని ఆమెను విడిపించారు. ఈ మేరకు దాడి చేసిన వారిపై కేసు నమోదు చేసినట్లు సమాచారం. పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.
News March 12, 2025
MBNR: యాసంగి పంటలను పరిశీలించిన కలెక్టర్

ఈ వేసవిలో రైతులు వేసిన పంటలు ఎండిపోకుండా వారికి ఆరుతడి పంటలపై అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అధికారులు ఆదేశించారు. కోయిలకొండ మండల పరిధిలోని సంగనోని పల్లి సేరి వెంకటాపూర్ గ్రామాల్లో రైతులు వేసిన వేసవి పంటలను మంగళవారం కలెక్టర్ పరిశీలించారు. వేసవి ఎండలకు నీటి జలాలు ఇంకి పోయి బోరు లో నీరు సరిపడినంత లేక పాక్షికంగా విస్తీర్ణంలో ఎండుముఖం పట్టడాన్ని గమనించారు.
News March 11, 2025
MBNR: విద్యార్థుల సమస్యల్ని తక్షణమే పరిష్కరించాలి: కలెక్టర్

కేజీబీవీ పాఠశాలలోని విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల్ని తక్షణమే పరిశీలించాలని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అధికారులను ఆదేశించారు. కోయిలకొండ మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలను మంగళవారం జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు విద్యార్థులుకు వడ్డిస్తున్న భోజనాన్ని పరిశీలించిన కలెక్టర్ రుచిచూసి భోజనంపై విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు కలెక్టర్ దృష్టికి వారు ఎదుర్కొంటున్న సమస్యలు వివరించారు.