News February 13, 2025
రాజాపేట: ఉరేసుకొని యువకుడి సూసైడ్

ఉరేసుకొని యువకుడు సూసైడ్ చేసుకున్న ఘటన రాజాపేట మండలంలో జరిగింది. SI అనిల్ కుమార్ తెలిపిన వివరాలు.. రఘునాథపురానికి చెందిన బిట్ల రమేశ్ పెద్ద కుమారుడు పవన్(25) గురువారం ఉదయం ఇంట్లో ఎవరులేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. ఘటనాస్థలానిక చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతుని తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
Similar News
News September 19, 2025
బతుకమ్మ పండుగ.. ఆకాశం నుంచి పూల వర్షం!

TG: బతుకమ్మ పండుగను వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈనెల 30న గ్రాండ్ ఫ్లోరల్ పరేడ్ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. అమరవీరుల స్మారక చిహ్నం నుంచి బతుకమ్మ ఘాట్ వరకు 2500 మంది మహిళలు బతుకమ్మలతో ర్యాలీ చేపట్టనున్నారు. ఆ సమయంలో హెలికాప్టర్ నుంచి పూలను చల్లి వారికి స్వాగతం పలుకుతారు. 28న LB స్టేడియంలో 20వేల మందితో బతుకమ్మ ఆడించి గిన్నిస్ రికార్డు సాధించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
News September 19, 2025
అసెంబ్లీ మార్షల్స్‌పై మంత్రి లోకేశ్ సీరియస్

అసెంబ్లీలో MLAలు, మీడియాపై మార్షల్స్ దురుసు ప్రవర్తనపై మంత్రి నారా లోకేశ్ సీరియస్ అయ్యారు. MLA ధూళిపాళ్ల నరేంద్ర మీడియా ప్రతినిధులతో మాట్లాడుతుండగా మార్షల్స్ అక్కడి నుంచి వెళ్లిపోవాలని నరేంద్రపై చేయి వేసి నెట్టే ప్రయత్నం చేశారు. అప్పుడే బయటకు వచ్చిన మంత్రి లోకేశ్ ఇంకా తాడేపల్లి ప్యాలెస్ పాలనలో ఉన్నామనుకుంటున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేల వ్యవహారంలో జోక్యం చేసుకోవద్దని హెచ్చరించారు.
News September 19, 2025
విశాఖ స్టీల్ ప్లాంట్‌కు ఢిల్లీ అధికారులు

ఢిల్లీ నుంచి స్టీల్ సెక్రటరీ సందీప్ పౌండ్రిక్, జాయింట్ సెక్రెటరీలు విశాఖ చేరుకున్నారు. వారు విశాఖ స్టీల్ ప్లాంట్‌ను నేడు సందర్శించనున్నారు. ఉత్పత్తి తగ్గుదల, బొగ్గు సమస్యపై అధికారులతో సమీక్షిస్తారు. అనంతరం ఎంపిక చేసిన అధికార ఉద్యోగ బృందాలతో సమావేశమౌతారు. స్టీల్ ప్లాంట్‌కు కేంద్రం ప్యాకేజీ ఇచ్చిన తర్వాత ప్రతి మూడు నెలలకోసారి సమీక్షల్లో భాగంగా వస్తున్నట్లు సమాచారం.