News January 9, 2026

‘రాజాసాబ్’ టికెట్ ధరల పెంపుపై HCలో పిటిషన్

image

TG: ప్రభాస్ ‘రాజాసాబ్’ టికెట్ ధరల <<18804706>>పెంపును<<>> సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. న్యాయవాది శ్రీనివాస్ దీన్ని సింగిల్ బెంచ్ జడ్జి వద్ద మెన్షన్ చేశారు. అర్ధరాత్రి టికెట్ ధరలు పెంచుతూ ప్రభుత్వం మెమో ఇచ్చిందని పేర్కొన్నారు. పిటిషన్‌పై కాసేపట్లో విచారణ జరగనుంది. కాగా నిన్న టికెట్ రేట్లు పెంచకపోవడంతో మేకర్స్ ప్రీమియర్స్ రద్దు చేశారు. చివరికి అర్ధరాత్రి ప్రభుత్వం జీవో జారీ చేసింది.

Similar News

News February 15, 2026

​జనజీవన స్రవంతిలోకి రండి.. మావోలకు TG పోలీస్ పిలుపు

image

TGలోని అండర్‌గ్రౌండ్ మావోయిస్టులు హింసను వీడి జనజీవన స్రవంతిలో కలవాలని పోలీస్ శాఖ మరోసారి విజ్ఞప్తి చేసింది. లొంగిపోయే వారికి ప్రభుత్వ ‘సరెండర్&రిహాబిలిటేషన్’ పాలసీ కింద తక్షణ ఆర్థిక సాయం, ఇతర ప్రయోజనాలు అందుతాయని DGP శివధర్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. రెండేళ్లలో 588 మంది సాధారణ జీవితంలోకి వచ్చి గౌరవప్రదంగా గడుపుతున్నారని పేర్కొన్నారు. మిగిలిన 15 మంది వెంటనే లొంగిపోవాలని కోరారు.

News February 15, 2026

T20 WC: USA భారీ స్కోర్

image

చెన్నై: నమీబియాతో మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన USA 20 ఓవర్లలో 199-4 స్కోర్ చేసింది. సంజయ్ కృష్ణమూర్తి (68*), మోనాంక్ పటేల్ (52) రాణించారు. సంజయ్ 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశారు. ఆయన ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 6 సిక్సులు ఉన్నాయి. NAM బౌలర్లలో విల్లెమ్, గెర్హార్డ్ ఎరాస్మస్ చెరో 2 వికెట్లు తీశారు.

News February 15, 2026

రైతులకు రూ.20వేలు ఎక్కడంటూ CBNకు YCP ప్రశ్న

image

AP: కూటమి ప్రభుత్వంలో అన్నదాతను నిండా ముంచేశారని వైసీపీ ఆరోపించింది. ‘అన్నదాత సుఖీభవ కింద 54 లక్షల మంది రైతులకు ఏటా రూ.20,000 ఇస్తామని చెప్పి ఈ బడ్జెట్లో రూ.6,600 కోట్లు మాత్రమే కేటాయించారు. ఈ నిధులు ఏ మూలకు సరిపోవు అన్న విషయం రాష్ట్రంలో అందరికీ తెలుసు. అయినా చంద్రబాబు మోసాన్ని భరించక తప్పడం లేదు. అరకొర నిధుల కేటాయింపుతో ఈ ఏడాదీ రైతులకు తిప్పలే’ అని ట్వీట్ చేసింది.