News January 9, 2026
‘రాజాసాబ్’ పార్ట్-2.. టైటిల్ ఇదే

‘రాజాసాబ్’ సినిమాకు పార్ట్-2 ఉంటుందని మేకర్స్ ప్రకటించారు. పార్ట్-2 టైటిల్‌ను ‘రాజాసాబ్ సర్కస్: 1935’గా ఖరారు చేసినట్లు మూవీ ఎండింగ్‌లో వెల్లడించారు. ఇందులో ప్రభాస్ జోకర్ లుక్‌లో కనిపించనున్నారు. అయితే ఇది ప్రీక్వెలా లేదా సీక్వెల్‌గా తెరకెక్కుతుందా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. కాగా ట్రైలర్‌లో చూపించిన కొన్ని సీన్లతో పాటు ప్రభాస్ ఓల్డేజ్ లుక్ సీన్లు పార్ట్-1లో లేవు. అవి పార్ట్-2లో ఉంటాయేమో.
Similar News
News February 10, 2026
హైదరాబాద్‌లో విజయ్-రష్మిక రిసెప్షన్?

హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక ఈ నెల 26న పెళ్లి చేసుకోనున్నట్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనికి మరింత బలం చేకూరుస్తూ మార్చి 4న వీరి రిసెప్షన్ HYDలోనే జరగనుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ కార్యక్రమానికి సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు హాజరవుతారని పేర్కొన్నాయి. పెళ్లి రాజస్థాన్‌లో జరగనుందని సమాచారం. అయితే పెళ్లిపై రష్మిక-విజయ్ ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.
Photo: AI
News February 10, 2026
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News February 10, 2026
భారత్‌తో మ్యాచ్‌కు పాక్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

టీ20 వరల్డ్ కప్‌లో ఈ నెల 15న టీమ్ ఇండియాతో మ్యాచ్ ఆడేందుకు పాకిస్థాన్ జట్టుకు ఆ దేశ ప్రభుత్వం అనుమతిచ్చింది. ఐసీసీ, బీసీబీ, పీసీబీ, శ్రీలంకతో జరిగిన చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాక్ ప్రభుత్వం పేర్కొంది. దీంతో ఈ నెల 15న యథావిధిగా మ్యాచ్ జరగనుందని ఐసీసీ పేర్కొంది. భారత్‌తో మ్యాచ్ ఆడాలని <<19097083>>బీసీబీ<<>> రిక్వెస్ట్ చేసిన కాసేపటికే పాక్ ప్రభుత్వం ఈ ట్వీట్ చేయడం గమనార్హం.


