News January 12, 2026

‘రాజాసాబ్’ మూడు రోజుల కలెక్షన్స్ ఎంతంటే?

image

‘రాజాసాబ్’ సినిమాకు 3 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.161కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు Sacnilk వెబ్‌సైట్ పేర్కొంది. ఇండియాలో రూ.129.20కోట్లు, ఓవర్సీస్‌లో రూ.31.80 కోట్లు రాబట్టినట్లు తెలిపింది. మూడో రోజు ఇండియాలో రూ.22.6 కోట్లు కలెక్ట్ చేసినట్లు వెల్లడించింది. కాగా నార్త్ అమెరికా గ్రాస్ కలెక్షన్స్ $2.2M (రూ.19.83కోట్లు) దాటినట్లు మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించింది.

Similar News

News February 21, 2026

వికసిత్ భారత్‌కు ‘మేడ్ ఇన్ ఇండియా చిప్స్’ కీలకం: మోదీ

image

IND అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి స్వయంసమృద్ధి సాధించడం కీలకమని PM మోదీ తెలిపారు. ఫాక్స్‌కాన్, HCL యూపీలో ఏర్పాటుచేయనున్న సెమీకండక్టర్ పరిశ్రమకు వర్చువల్‌గా ఆయన శంకుస్థాపన చేశారు. ‘కరోనా టైమ్‌లో చిప్‌ల సరఫరా వ్యవస్థ దెబ్బతినడంతో అనేక ఆర్థిక వ్యవస్థలు ప్రభావితమయ్యాయి. వికసిత్ భారత్‌కు మేడ్ ఇన్ ఇండియా చిప్స్ ముఖ్యం. ఈ దశాబ్దంలో నిర్ణయాలు 21వ సెంచరీలో సామర్థ్యాలకు పునాదులవుతాయి’ అని పేర్కొన్నారు.

News February 21, 2026

మరో బాంబ్ పేల్చిన ట్రంప్.. 15 శాతానికి టారిఫ్స్

image

ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. గ్లోబల్ టారిఫ్స్‌ను 10 నుంచి 15 శాతానికి పెంచారు. దశాబ్దాలుగా USను పలు దేశాలు దోచుకున్నాయని పేర్కొన్నారు. రాబోయే కొద్ది నెలల్లో చట్టబద్ధంగా అనుమతించదగిన సుంకాలను నిర్ణయించి అమలు చేస్తామన్నారు. కాగా ప్రపంచ దేశాలపై టారిఫ్స్ వేసే హక్కు అధ్యక్షుడికి లేదని US సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంపై మండిపడిన ట్రంప్ కొద్ది గంటల కిందటే 10% టారిఫ్స్ విధించిన విషయం తెలిసిందే.

News February 21, 2026

లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడి.. 10 మంది మృతి

image

లెబనాన్‌లోని హెజ్బొల్లా గ్రూపులే లక్ష్యంగా ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. ఈ ఘటనలో సీనియర్ ఫీల్డ్ కమాండర్ సహా 10 మంది మరణించగా 50 మందికి గాయాలయ్యాయి. ఇరు దేశాల మధ్య 2024 నవంబర్‌లో కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత ఇదే అతిపెద్ద దాడి అని అంతర్జాతీయ మీడియా వెల్లడించాయి. తమ దేశంపై దాడులకు ప్రణాళికలు వేస్తున్నారనే పక్కా సమాచారంతోనే రివర్స్ అటాక్ చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది.