News January 19, 2026
‘రాజాసాబ్’.. 10 రోజుల కలెక్షన్లు ఎంతంటే?

ప్రభాస్, మారుతి కాంబినేషన్లో తెరకెక్కిన ‘రాజాసాబ్’ మూవీ బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. థియేటర్లలో విడుదలైన 10 రోజుల్లో ఈ సినిమా దేశవ్యాప్తంగా రూ.139.25 కోట్లు(నెట్) వసూలు చేసినట్లు Sacnilk తెలిపింది. నిన్న ఈ సినిమా రూ.2.50 కోట్లు రాబట్టినట్లు అంచనా వేసింది. ప్రపంచవ్యాప్తంగా 10 రోజుల్లో రూ.180 కోట్ల నెట్ కలెక్షన్స్ దాటినట్లు సినీ వర్గాలు తెలిపాయి.
Similar News
News February 12, 2026
విండీస్ విజయం.. ఇతర జట్లకు వార్నింగే!

టీ20 క్రికెట్ సంచలనాలకు మారుపేరు. ఈ ఫార్మాట్‌లో వెస్టిండీస్ ప్రదర్శన అద్భుతమని రికార్డులు చెబుతున్నాయి. రెండు సార్లు కప్పు గెలిచిన ఈ జట్టు తమదైన రోజున ఏ టీమ్‌నైనా ఓడించగలదు. T20 WC-2026 ఫేవరెట్‌గా ఉన్న ఇంగ్లండ్‌ను ఓడించి ఇతర జట్లకు అదే హెచ్చరికలు ఇచ్చింది. హోప్, హెట్‌మెయర్, రూథర్‌ఫోర్డ్, పావెల్ వంటి హిట్టర్లు చెలరేగితే WIకు తిరుగుండదు. మరి రానున్న రోజుల్లో ఇంకెన్ని జట్లకు షాక్ ఇస్తుందో చూడాలి.
News February 12, 2026
మంత్రాలయ మహాత్యం

మంత్రాలయంలోని రాఘవేంద్ర స్వామి బృందావనం అతి పవిత్రమైనది. 1671లో స్వామివారు సజీవంగా బృందావన ప్రవేశం చేశారు. ఆయన భౌతికంగా మనకు కనిపించకపోయినా, మరో 700 ఏళ్ల పాటు అందులోనే ఉంటూ అనుగ్రహిస్తారని ప్రతీతి. కల్పవృక్షంలా కోరిన కోర్కెలు తీర్చే ఈ క్షేత్రానికి దేశవ్యాప్తంగా భక్తులు తరలివస్తారు. స్వామివారికి సమర్పించే ‘మృత్తిక’ (పవిత్ర మట్టి) సకల వ్యాధులను, గ్రహ దోషాలను నివారిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
News February 12, 2026
ఫిబ్రవరి 12: చరిత్రలో ఈరోజు

➤ 1809: బ్రిటన్ శాస్త్రవేత్త చార్లెస్ డార్విన్ జననం
➤ 1809: అమెరికా 16వ అధ్యక్షుడు అబ్రహం లింకన్ జననం
➤ 1824: ఆర్యసమాజ్ స్థాపకుడు స్వామి దయానంద సరస్వతి జననం
➤ 1961: శుక్ర గ్రహంపైకి తొలిసారిగా అంతరిక్ష నౌక (వెనెరా-1)
➤ 1962: సినీ నటుడు జగపతిబాబు జననం(ఫొటోలో)
➤ 1968: నటుడు పువ్వుల సూరిబాబు మరణం
➤ 2019: సినీ దర్శకుడు విజయ బాపినీడు మరణం


