News July 6, 2025

రాజీవ్ యువ వికాసానికి యువత ఎదురుచూపులు

image

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రాజీవ్ యువ వికాసం పథకంకై గద్వాల జిల్లాలోని నిరుద్యోగ యువత ఆశగా ఎదురుచూస్తున్నారు. దరఖాస్తులు సమర్పించి నెలలు గడుస్తున్నా.. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో రాయితీ రుణాలతో స్వయం ఉపాధి పొందుదామనుకున్న యువత నిరాశకు గురవుతున్నారు. రాజీవ్ యువ వికాసం పథకంను ప్రభుత్వం త్వరగా అమలు చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని వారు కోరుతున్నారు.

Similar News

News July 7, 2025

రేపు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు

image

రేపు APలోని శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది. మరోవైపు TGలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, జనగాం, RR, HYD, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది.

News July 7, 2025

సిద్దిపేట: రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

image

కోహెడ మండలం తంగళ్లపల్లిలో ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. స్థానికులు తెలిపిన వివరాలు.. ఇద్దరు యువకులు బైక్‌పై వేగంగా వెళ్తూ గ్రామానికి చెందిన కొత్తూరు సత్తయ్య ఇంటి గోడను బలంగా ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో వారు అక్కడికక్కడే మృతిచెందారు. మృతులు బోదాసు శ్రీకాంత్, దామెర రిషిగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News July 7, 2025

అనకాపల్లి జిల్లాలో యాక్సిడెంట్.. వ్యక్తి మృతి

image

అనకాపల్లి(M) తగరంపూడి వద్ద ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. రావికమతం(M) మట్టవానిపాలెంకి చెందిన బలిరెడ్డి ప్రసాద్(46) మరణించగా అతని భార్య ఉష తీవ్ర గాయాలతో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. తుంపాలలో తన సొంత వ్యవసాయ భూమిలో వరి విత్తనాలు పోసేందుకు బైక్‌పై వెళ్లారు. తిరుగు ప్రయాణంలో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. వీరికి కుమారులు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.