News March 27, 2025

రాజీవ్ యువ వికాస పథకం దరఖాస్తులు స్వీకరించాలి: కలెక్టర్

image

యువతకు స్వయం ఉపాధి అవకాశాలను కల్పిస్తూ ఆర్థిక సాయం అందించడానికి ప్రభుత్వం చేపట్టిన రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తులు స్వీకరించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. బుధవారం ఐడీఓసీ కార్యాలయం నుంచి మండల ప్రత్యేక అధికారులు, తహశీల్దార్లు, ఎంపీడీఓలు, మున్సిపల్ అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు యువత పథకాన్ని వినియోగించుకోవాలన్నారు.

Similar News

News November 16, 2025

మంచిర్యాల: దివ్యాంగురాలి అనుమానాస్పద మృతి

image

MNCL(D) దండేపల్లి(M) వెంకటరావుపేటకు చెందిన మల్లేషం-పోషవ్వ దంపతుల కూతురు దివ్యాంగురాలైన అర్చన(15) KNR జిల్లా వావిలాలపల్లిలో శనివారం అనుమానాస్పదంగా మృతి చెందింది. ఆమె సోదరుడు అశ్రిత్ పరిస్థితి విషమంగా ఉంది. తల్లి కిరాణా షాప్‌కు వెళ్లి వచ్చే సరికి ఇద్దరూ స్పృహ కోల్పోయి కనిపించారు. ఆసుపత్రికి తరలించగా అర్చన చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఘటన జరిగినప్పటి నుంచి వారి తండ్రి మల్లేషం కనిపించడం లేదు.

News November 16, 2025

ప్రజా జీవితంలోకి రాబోతున్నా: ఆశ కిరణ్

image

వంగవీటి రంగా ఫ్యామిలీలో పొలిటికల్ హీట్ రాజుకుంది. నేడు ఆశ కిరణ్ విజయవాడలో తన తండ్రి రంగా విగ్రహానికి నివాళులర్పించారు. ఇప్పటి నుంచి ప్రజా జీవితంలోకి రాబోతున్నా అని ఆమె అన్నారు. రాజకీయాల్లో శూన్యత ఉందని, వైసీపీ ఆహ్వానంపై ఇప్పుడే స్పందించలేనని చెప్పారు. రంగా ఆశయాలను ముందుకు తీసుకెళ్తామన్నారు.

News November 16, 2025

కుమారుడి ఫస్ట్ బర్త్‌డే.. ఫొటో షేర్ చేసిన రోహిత్

image

టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ తన ఫ్యామిలీతో కలిసి ఫారిన్ టూర్‌లో ఎంజాయ్ చేస్తున్నారు. నిన్న తన కుమారుడు అహాన్ ఫస్ట్ బర్త్‌డే సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ ఫొటోలను ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ‘సమయం చాలా వేగంగా ముందుకు వెళ్తోంది. కానీ ప్రతి క్షణాన్ని మేము ఆస్వాదిస్తున్నాం’ అని పేర్కొన్నారు.