News September 8, 2025
రాజీ దారిలోనే కేసుల పరిష్కారం: వరంగల్ సీపీ

ఈనెల 13న జరగనున్న జాతీయ మెగా లోక్ అదాలత్ సందర్భంగా కక్షిదారులు తప్పనిసరిగా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ పిలుపునిచ్చారు. ఈరోజు సీపీ మాట్లాడుతూ.. రాజీ ద్వారా పరిష్కరించగల కేసుల్లో కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయాన్ని, డబ్బును వృథా చేసుకోవద్దని సూచించారు. “రాజీయే రాజమార్గం” అని ఆయన స్పష్టం చేస్తూ, చిన్న కేసులను రాజీ ద్వారా సులభంగా పరిష్కరించుకోవచ్చన్నారు.
Similar News
News September 8, 2025
ఐనవోలు: భారీగా గంజాయి పట్టివేత

మామునూరు ACP వెంకటేశ్, CI రాజగోపాల్, ఎస్ఐ శ్రీనివాస్ కలిసి ఈరోజు మాట్లాడారు. చింతకుంట క్రాస్ వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా MH19AX7887 నంబర్ గల కారు తమను తప్పించుకునేందుకు యత్నిస్తుండగా అనుమానంతో ఆపి తనిఖీ చేశామన్నారు. కారులో 214.370కిలోల గంజాయి ఉందని, దాని విలువ రూ.1,07,18,500 అని తెలిపారు. వారి నుంచి హోండా సిటీ కారు, 3 సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకొని, కేసు నమోదు చేసి, కోర్టులో హాజరు పరిచామన్నారు.
News September 8, 2025
టిక్ టాక్‌పై బ్యాన్ ఎత్తివేయం: కేంద్ర మంత్రి

టిక్ టాక్ యాప్‌పై నిషేధం ఎత్తివేసే ఆలోచన లేదని కేంద్ర ఐటీశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఆ యాప్‌ను మళ్లీ పునరుద్ధరించే ప్రతిపాదనలు రాలేదని స్పష్టం చేశారు. దీనిపై ప్రభుత్వంలో కూడా ఎలాంటి చర్చలు జరగలేదని చెప్పారు. కాగా భారత్-చైనా మధ్య సంబంధాలు మెరుగుపడుతుండటంతో టిక్ టాక్ యాప్ మళ్లీ ఇండియాలోకి వస్తుందంటూ ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. దీనిపై మంత్రి ఈ విధంగా స్పందించారు.
News September 8, 2025
శ్రీరాంపూర్ ఏరియా 19 మందికి పదోన్నతి

సింగరేణి శ్రీరాంపూర్ ఏరియా నుంచి 19మందికి డిప్యూటీ మేనేజర్లుగా పదోన్నతి లభించింది. సోమవారం యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. పదోన్నతి పొందిన వారిలో సాత్విక్, వినయ్‌రెడ్డి, వెంకటరామ్, హేమంత్, వేణుగోపాల్, అనిల్, నాగరాజు, అనిల్‌సింగ్, జగదీశ్వర్ రావు, జలాలుద్దీన్, మధుసూదన్‌రావు, రవికిరణ్,శ్రీనివాస్, రొడ్డ రాజేష్, కిరణ్‌కుమార్, రాకేష్,నరేష్, సునీల్‌కుమార్,చంద్రశేఖర్‌రెడ్డి ఉన్నారు.