News September 10, 2025

రాజీ మార్గమే రాజమార్గం: NGKL ఎస్పీ

image

జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోలాని నాగర్‌కర్నూల్‌ ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రంగనాథ్ సూచించారు. ఈనెల 13న జిల్లాలోని అన్ని కోర్టుల్లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. రాజీపడదగిన సివిల్, క్రిమినల్ కేసులను ఇరువర్గాల అంగీకారంతో పరిష్కరించుకోవచ్చని సూచించారు. “రాజీ మార్గమే రాజమార్గం” అని పేర్కొంటూ, కేసులను పరిష్కరించుకోవాలని కోరారు.
-SHARE IT

Similar News

News September 10, 2025

సూర్యాపేట అదనపు కలెక్టర్‌గా సీతారామరావు

image

సూర్యాపేట జిల్లా అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ)గా కె.సీతారామరావు నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం నల్గొండ జిల్లాలో స్పెషల్ కలెక్టర్‌గా పనిచేస్తున్న ఆయన, ఇటీవలే పదవీ విరమణ చేసిన అదనపు కలెక్టర్ రాంబాబు స్థానంలో బాధ్యతలు చేపట్టనున్నారు.

News September 10, 2025

ఓర్వకల్లు రాక్ గార్డెన్‌ సందర్శించిన మంత్రి

image

ఓర్వకల్లులో సహజ సిద్ధంగా ఏర్పడ్డ రాక్ గార్డెన్ అద్భుత ప్రకృతి సౌందర్యానికి నిలయంగా నిలుస్తోందని మంత్రి కందుల దుర్గేశ్ అన్నారు. రాక్ గార్డెన్‌ను బుధవారం ఆకస్మికంగా సందర్శించి హరిత రిసార్ట్స్, రెస్టారెంట్‌ను పరిశీలించారు. అక్కడి అధికారులు, సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. సహజ సిద్ధమైన కొండల మధ్య ఉన్న రాతివనం, చెరువు, ఏళ్ల క్రితం ఏర్పడ్డ వివిధ ఆకృత రాళ్లు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయన్నారు.

News September 10, 2025

నిర్మల్: పట్టణాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి

image

నిర్మల్ పట్టణంలోని మినీ ట్యాంక్ బండ్ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన లేక్ వ్యూ పాయింట్‌ను జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, కలెక్టర్ అభిలాష అభినవ్‌తో కలిసి ప్రారంభించారు. నిర్మల్ పట్టణ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రజలకు వినోదం, విశ్రాంతి కలిగించేలా లేట్ వ్యూ పాయింట్‌ను అందుబాటులోకి తెచ్చామన్నారు.