News March 9, 2025
రాజుపాలెం: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

ఆ ఉద్యోగి ఆదివారం సెలవు కావడంతో కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుదామనుకున్నాడు. కానీ అంతలోనే విషాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పిడుగురాళ్ల (M) జూలకల్లుకు చెందిన సంధ్యానాయక్ హైకోర్టులో ఉద్యోగం చేస్తున్నారు. ఆదివారం సెలవు కావడంతో శనివారం రాత్రి ఇంటికి వస్తుండగా రెడ్డిగూడెం సమీపంలో లారీ కిందపడి స్పాట్‌లోనే మృతి చెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News July 6, 2025
ఐఐఐటీకి తగ్గుతున్న వికారాబాద్ జిల్లా విద్యార్థుల సంఖ్య

వికారాబాద్ జిల్లా నుంచి ఐఐఐటీలో చేరే విద్యార్థుల సంఖ్య రోజురోజుకు తగ్గిపోతోంది. ప్రభుత్వ, జడ్పీ, ఆదర్శ పాఠశాలల్లో పదో తరగతి అభ్యసించిన విద్యార్థుల మార్కుల ఆధారంగా బాసరలో అడ్మిషన్లు పొందుతున్నారు. గతేడాది VKB జిల్లా నుంచి 18 మంది ఐఐఐటీకి ఎంపికవగా.. ఈ ఏడాది కేవలం ఆరుగురు మాత్రమే ఎంపికవడం గమనార్హం. మహబూబ్‌నగర్ జిల్లాలో మరో ఐఐఐటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
News July 6, 2025
శ్రీకాకుళం జిల్లాలో యువకుడు దారుణ హత్య

కొత్తూరు మండలం వసప గ్రామ సమీపంలో అర్ధరాత్రి వేళ ఘోర సంఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన లుకలాపు మిన్నారావు (21) అనే యువకుడిని గుర్తుతెలియని వ్యక్తులు అతి దారుణంగా హత్య చేశారు. ఆదివారం ఉదయం మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న సీఐ చింతాడ ప్రసాద్ ఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరిస్తున్నారు.
News July 6, 2025
కన్నాయిగూడెం: మత్స్యకారుల వలకు చిక్కిన దెయ్యం చేప

కన్నాయిగూడెం మండలంలోని మత్స్యకారుల వలకు ఓ వింత చేప చిక్కింది. దీంతో జాలర్లు ఒక్కసారిగా అవాక్కయ్యారు. దెయ్యం చేపగా పిలుచుకునే ఈ చేప తినడానికి, ఔషధాల తయారీకి కూడా పనికిరాదని మత్స్యకారులు తెలిపారు. కాగా, ఈ చేప నదిలో, చెరువులో ఎక్కడున్నా మిగతా చేపలను, వాటి గుడ్లను తినడం వంటి లక్షణాలున్న ప్రమాదకరమైన చేప అన్నారు. ఈ చేపలు ఉన్నచోట మిగతా చేపలు కూడా ఎదుగుదల ఉండదని మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు.