News March 30, 2024
రాజుపాళెం: విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి

రాజుపాళెం మండలం తొండలదిన్నె గ్రామానికి చెందిన నొస్సం బాబుషా (17) అనే యువకుడు విద్యుత్ షాక్ తగిలి మృతి చెందాడని ఎస్ఐ తులసీ నాగప్రసాద్ తెలిపారు. నొస్సం సంజీవ్ భూమిని కౌలుకు తీసుకుని వరి పంటను సాగు చేసుకుంటున్నారు. ఆ పొలానికి సాగు నీరు పారించేందుకు కుమారుడు బాబుషా అక్కడికి వెళ్లాడు. నీటిని విడిచే సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ మోటార్ కు విద్యుత్ సరఫరా కావడంతో బాబుషా అక్కడికక్కడే మృతి చెందాడు.
Similar News
News March 2, 2026
కడప జిల్లాలో గత నెలలో రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం ఎంతంటే.!

జిల్లాలో గత నెలలో 5,329 రిజిస్ట్రేషన్లు జరగ్గా.. ప్రభుత్వానికి రూ.20.28 కోట్లు ఆదాయం లభించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో నెలవారీగా రిజిస్ట్రేషన్ల సంఖ్య, ఆదాయం రూ.కోట్లలో ఇలా ఉంది. ఏప్రిల్-5274-20.86, మే-6461-22.98, జూన్-6382-22.12, జులై-6673-25.51, ఆగస్ట్-5486-21.91, సెప్టెంబర్-5988-23.81, అక్టోబర్-5988-21.73, నవంబర్-5527-22.67, డిసెంబర్-5907-23.35, జనవరిలో 5898 – రూ.26.45 కోట్లు వచ్చింది.
News March 1, 2026
వల్లూరు: చంద్రగ్రహణం సందర్భంగా పుష్పగిరి ఆలయం మూసివేత

వల్లూరు (M) పుష్పగిరి లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయం చంద్రగ్రహణం సందర్భంగా ఈ నెల మూడో తేదీన ఉదయం 6 గంటల నుంచి నాలుగో తేదీ ఉదయం ఏడున్నర వరకు తలుపులు మూసివేసి ఉంటుందని దేవాలయ ఈవో శ్రీనివాసులు ఆదివారం తెలిపారు. చంద్రగ్రహణం అనంతరం ఆలయ శుద్ధి, పుణ్యహ వచనం స్వామివారికి విశేష అభిషేకం అనంతరం భక్తులకు స్వామివారి దర్శనం ఉంటుందని తెలిపారు. ఈ విషయాన్ని భక్తులు గమనించాలన్నారు.
News March 1, 2026
పుష్పగిరి నదిలో ఇద్దరు యువకులు గల్లంతు

వల్లూరు మండలం పుష్పగిరి నదిలో ఆదివారం ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. ముగ్గురు యువకులు డ్యాం చూడటానికి వచ్చి సరదాగా నదిలో దిగారు. ప్రమాదవశాత్తు ముగ్గురు నదిలో కొట్టుకుపోయారు. అందులో సురేంద్ర(25) అనే యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడు. మిగిలిన ఇద్దరు శ్రీనాథ్, చైతన్యలు గల్లంతయ్యారు. శ్రీనాథ్ రైల్వే కొండాపురానికి చెందిన వ్యక్తిగా సురేంద్ర తెలిపారు. మృతదేహాల కోసం స్థానికులు గాలిస్తున్నారు.


