News January 8, 2026
రాజులకొత్తూరు వద్ద ప్రమాదం.. నాలుగు కార్లను ఢీకొన్న లారీ

తుని మండలం రాజులకొత్తూరు జాతీయ రహదారి 216 పై జరిగిన ప్రమాదం స్థానికులను ఉలిక్కిపడేలా చేసింది. విశాఖపట్నం నుంచి రాజమండ్రి వెళ్తున్న ఓ లారీ బ్రేక్ ఫెయిలై అదుపు తప్పి వరుసగా నాలుగు కార్లను ఢీకొట్టింది. ఈ ఘటనలో కార్లు పూర్తిగా తుక్కుతుక్కయ్యాయి. కార్లలో ఉన్న ప్రయాణికులందరూ అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడటం విశేషం. ధ్వంసమైన వాహనాలను చూసి వాహనదారులు విస్మయానికి గురవుతున్నారు.
Similar News
News January 9, 2026
TTD బోర్డు సభ్యత్వానికి జంగా రాజీనామా..?

TTD బోర్డు సభ్యత్వానికి జంగా కృష్ణమూర్తి రాజీనామా చేశారన్న ప్రచారం నడుస్తోంది. తిరుమలలో ఈయనకు గెస్ట్ హౌస్ నిర్మాణం కోసం TTD బోర్డ్ అనుమతులు ఇచ్చినట్లు సమాచారం. ఇది నిబంధనలకు విరుద్ధం. ఇది వరకే కోర్టు దీనిపై ఆదేశాలు సైతం ఇచ్చింది. దీనిపై కథనాలు వచ్చిన నేపథ్యంలో ఆయన బోర్డు సభ్యత్వానికి రాజీనామా చేశారని అంటున్నారు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
News January 9, 2026
త్వరలో సూళ్లూరుపేటకు మహర్దశ.!

సూళ్లూరుపేట(M) బీవీపాలెం సమీపంలో దాదాపు 150 ఎకరాల్లో ఫ్లోటింగ్ వాటర్ రిసార్ట్స్, వాటర్ స్పోర్ట్స్, ఎకో-టూరిజంతో పాటు పులికాట్ పరిసర ప్రాంతాల్లో గ్రీన్ టూరిజం అభివృద్ధి చేయనున్నారు. ఈ టూరిజాన్ని PPP మోడల్‌లో పెట్టుబడులను ఆకర్షించే అవకాశం ఉంది. సుమారు రూ.350 కోట్ల నుంచి రూ.500 కోట్ల వరకు పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. ఇక టూరిజం ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 500 పైచిలుకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
News January 9, 2026
రేవంత్ రైతులపై కక్షగట్టారు: హరీశ్‌రావు

TG: కరోనాలోనూ KCR రైతుబంధు అపలేదని మాజీమంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. సిద్దిపేట(D) నర్మెట్ట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని సందర్శించారు. సిద్దిపేటలో పూర్తిస్థాయిలో నూనె ఉత్పత్తి ప్రారంభమైందన్నారు. ‘కాంగ్రెస్ పాలనలో వ్యవస్థ అస్తవ్యస్తమైంది. యూరియా కోసం యాప్‌లు పెట్టి రైతులను ఇబ్బందులు పెడుతోంది. వానాకాలం పంటలకు రూ.600కోట్ల బోనస్ పెండింగ్ పెట్టింది. రేవంత్ కావాలనే రైతులపై కక్షగట్టారు’ అని విమర్శించారు.


