News June 8, 2024

రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆరో స్నాతకోత్సవం

image

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆరో స్నాతకోత్సవం జూన్ 10న జరగనుంది. రాజేంద్రనగర్‌లోని విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో ఉదయం 10 గంటలకు ఇది జరుగుతుందని వ్యవసాయ శాఖ కార్యదర్శి, APC, PJTSAU ఇన్‌ఛార్జి ఉపకులపతి ఎం.రఘునందన్ రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్, పాండిచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్, విశ్వవిద్యాలయ కులపతి C.P రాధాకృష్ణన్ అధ్యక్షతన ఈస్నాతకోత్సవం జరుగుతుందని తెలిపారు.

Similar News

News September 15, 2025

జూబ్లీహిల్స్: ప్రతి బూత్‌కు 10 మంది

image

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడ విజయం సాధించాలని సీఎం కంకణం కట్టుకున్నారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న దాదాపు 407 బూత్‌లలో చురుకైన కార్యకర్తలను ఎంపిక చేయాలని నిర్ణయించారు. ఒక్కో బూత్‌కు 10 మంది చొప్పున ఎంపిక చేసి హస్తానికే ఓట్లు దక్కేలా చూడాలని అధిష్ఠానం నిర్ణయించింది. ఈ నెల 21లోపు ఎంపిక పూర్తిచేయనున్నారు.

News September 15, 2025

HYD: ఏళ్లకేళ్లుగా సిటీలోనే తిష్ట!

image

నగరంలోని మెడికల్ కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా పనిచేస్తున్న 64 మందికి ప్రభుత్వం అసోసియేట్ ప్రొఫెసర్లుగా పదోన్నతి కల్పించింది. వారిని ఇక్కడి నుంచి బదిలీలు చేయడం లేదు. జిల్లా కేంద్రాల్లో ఉన్న వారిని ఇక్కడికి తెచ్చి.. ఇక్కడున్న వారిని జిల్లా కేంద్రాలకు పంపాలని జిల్లాల్లోని వారు కోరుతున్నారు. అయితే ఏళ్లకేళ్లుగా ఇక్కడే తిష్టవేసుకొని ఉంటున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

News September 15, 2025

షాన్‌దార్ హైదరాబాద్.. ఇక పదిలం

image

HYD సంపద చారిత్రక కట్టడాలే. 12 వారసత్వ కట్టడాలను పరిరక్షించి వాటికి పూర్వ వైభవం తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. టెండర్లకు కూడా ఆహ్వానించింది. ఖైరతాబాద్ మసీదు, రొనాల్డ్ రాస్ భవనం, షేక్‌పేట మసీదు, చెన్నకేశవస్వామి గుడి, రేమండ్ సమాధి, హయత్‌బక్షిబేగం, పురానాపూల్ దర్వాజా, టోలి మసీదు, ఖజానా భవన్ (గోల్కొండ), షంషీర్ కోట, గన్‌ఫౌండ్రి, మసీదు ఇ మియన్ మిష్క్‌ను అద్భుతంగా తీర్చిదిద్దనున్నారు.