News March 17, 2025

రాజేంద్రనగర్‌ NIRDPRలో రూ. లక్ష జీతంతో ఉద్యోగం

image

రాజేంద్రనగర్‌లోని NIRDPRలో కాంట్రాక్ట్ బేసిస్ కింద 33 పోస్టులను భర్తీ చేస్తున్నారు. బీటెక్, PG, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత విభాగాల్లో అనుభవం ఉన్నవారు మాత్రమే అర్హులు. వయస్సు 60 ఏళ్లకు మించకూడదు. జూనియర్ ప్రాజెక్ట్ ఆఫీసర్‌కు రూ. 1,00,000, ప్రాజెక్ట్ ఆఫీసర్‌కు రూ. 1,40,000, ప్రోగ్రాం ఆఫీసర్‌రు రూ. 1,90,000 జీతం చెల్లిస్తారు. అప్లై చేసేందుకు మార్చి 19 చివరి తేదీ.
SHARE IT

Similar News

News March 17, 2025

HYD: జర్నలిస్టులకు బెయిల్ మంజూరు

image

చంచల్‌గూడ జైలులో ఉన్న యూట్యూబ్ జర్నలిస్టులు తన్వి యాదవ్, రేవతిలకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.25 వేల పూచికత్తుతో నాంపల్లి కోర్టు బెయిల్‌ను ఇచ్చింది. కాగా.. పోలీసులు తన్వి యాదవ్‌తో పాటు రేవతిలను కస్టడీకి కోరుతూ పిటిషన్ వేయగా పిటిషన్‌ను తిరస్కరిస్తూ బెయిల్ మంజూరు చేసింది.

News March 17, 2025

ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు

image

☛ చేనేత కార్మికుల ఇళ్లకు 200 యూనిట్ల వరకు, మరమగ్గాలకు 500 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్
☛ టీచర్ల బదిలీల నియంత్రణ చట్టసవరణ బిల్లుకు ఆమోదం
☛ అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో రెన్యువబుల్ ఎనర్జీ ప్లాంట్ల ఏర్పాటుకు ఆమోదం
☛ రాజధాని భూకేటాయింపులపై క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయాలకు గ్రీన్ సిగ్నల్
☛ YSR తాడిగడప మున్సిపాలిటీ పేరు తాడిగడపగా మార్పు
☛ నంబూరులోని VVITకి ప్రైవేట్ వర్సిటీ హోదా

News March 17, 2025

VJA: పదో తరగతి పరీక్షా కేంద్రాల్లో కలెక్టర్ తనిఖీలు

image

10వ తరగతి పరీక్షలు ప్రారంభమైన నేపథ్యంలో సోమవారం కలెక్టర్ లక్ష్మీశ విజయవాడలోని గవర్నర్‌పేట సీవీఆర్ మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాల పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేశారు. ప్రశాంత వాతావరణంలో పరీక్షల నిర్వహణకు చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. వేసవి నేపథ్యంలో తాగునీరు, విద్యుత్తు సరఫరాకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

error: Content is protected !!